Goodbye ... goodbye ...

ముకుందా… ముకుందా…

Date: 04/01/2018

కోల్‌కతా ముచ్చట్లు:

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ ‘తెలుగు వెలుగు’ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడంలో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం! తెలుగును కొత్త వెలుగులో ప్రపంచానికి చూపిద్దాం! పరమహంస యోగానంద… పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ యోగి. ఆయన జన్మనామం ముకుంద లాల్‌ ఘోష్‌. ఆయన రాసిన ఒక యోగి ఆత్మకథ అనే ఆధ్యాత్మిక రచన అనేక ప్రతులు అమ్ముడై సంచలనం సృష్టించింది. యోగానంద, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక సాంప్రదాయ బెంగాలీ కుటుంబంలో జన్మించాడు. ఆయన తమ్ముడు సనందుడి మాటలను బట్టి యోగానంద చిన్నవయసు నుంచే ఆధ్యాత్మికతలో వయసుకు మించిన ఆసక్తిని, పరిణతిని కనబరిచేవాడు. యవ్వనంలో ఉండగా ఆయన తన ఆధ్యాత్మిక తృష్ణను తీర్చుకోవడానికి ఎంతో మంది భారతీయ సన్యాసులను కలిశాడు. చివరకు ఆయనకు 17 ఏళ్ళ వయసులో, 1910 సంవత్సరంలో యుక్తేశ్వర్‌ గిరిని తన గురువుగా కనుగొనడం జరిగింది. ఆయన గురువుతో కలిసిన మొట్టమొదటి కలయిక జన్మజన్మలకీ గుర్తుండిపోతుందని తన ఆత్మకథలో రాసుకున్నాడు. కలకత్తాలోని స్కాటిష్‌ చర్చి కళాశాల నుండి ఆర్ట్స్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలో ఉత్తీర్ణుడై 1915, జూన్‌లో కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల అయిన సీరాంపూర్‌ కళాశాలనుండి ఇప్పటి బి.ఏ డిగ్రీకి సమానమైన డిగ్రీని పొందాడు. అప్పట్లో దాన్ని ఏ.బి డిగ్రీగా వ్యవహరించేవారు. అక్కడ చదివే రోజుల్లో యోగానంద సీరాంపూర్‌లోని యుక్తేశ్వర ఆశ్రమంలో సమయాన్ని గడిపేవాడు. 1956లో సన్యాస ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించి స్వామి యోగానంద గిరి అయ్యాడు. 1917లో యోగానంద పశ్చిమ బెంగాల్లోని దిహికాలో ఒక బాలుర పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలోఆధునిక విద్యాబోధన పద్ధతులతో పాటు యోగాభ్యాసం, ఆధ్యాత్మిక చింతనను కూడా విద్యార్ధులకు బోధించేవారు. ఆ మరుసటి సంవత్సరం పాఠశాలను రాంచీకి తరలించారు. ఈ పాఠశాలే ఆ తర్వాత కాలంలో భారత యోగద సత్సంగ సమాజంగా రూపుదిద్దుకొన్నది. ఇది యోగానంద అమెరికా సంస్థకు భారతీయ శాఖ. క్రియాయోగాన్ని బోధించడం వారు చేసిన పని… పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మ కథ ద్వారా (ఈ పుస్తకం 17 బాషలలోకి అనువదించబడింది) ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రేమ పూర్వకమైన ఆధ్యాత్మిక పరిమళాలను వ్యాపింప చేస్తున్నారు. భారతీయ ఆధ్యాత్మికతను పచ్చిమ దేశాల క్రైస్తవ ఆధ్యాత్మికతను సమ్మేళనం చేసి రెండు మతాల మధ్య మరింత సామరశ్యాన్ని పెంపొంధించ్చారు. మహావతార్‌ బాబాజీ తన శిష్యులైన యోగావతార్‌ లాహిరి మహాశయుల ద్వారా సామాన్య ప్రజలు కుడా పాటించ వీలైన క్రియయోగాన్ని మానవాళికి అందించారు. అర్హులై, త్రికరణ శుద్ధిగా చేసే సాధకుల ఆధ్యాత్మిక ప్రగతిని ఎంతో వేగవంతం చేసే ఈ క్రియయోగాన్ని లాహిరి శిష్యులైన జ్ఞానవతార్‌ యుక్తేశ్వరి గిరి, అయన ప్రియ శిష్యులైన పరమహంస యోగానంద ప్రపంచ వ్యాప్తంగా అర్హులైన శిష్యులందరికీ అందుబాటలోకి తెచ్చారు. వీరు స్థాపించిన యోగద సత్సంగ్‌ సొసైటీ (భారతదేశంలో) ఆసక్తి కలిగిన వారిని క్రియయోగ కోర్సుకు సభ్యులుగా చేర్చుకుని ప్రతి 15 రోజులకు పాటాలు పంపిస్తూ, వైఎస్‌ఎస్‌ తరపున వచ్చే స్వామీజీలు అడిగే ప్రశ్నలకు కోర్సు చేస్తున్న వారు సంతృప్తికర సమాధానాలు ఇచ్చాక వారికి నిర్ణీత ఈ కేంద్రంలో స్వామీజీ క్రియయోగ దీక్ష ఇస్తారు. క్రియయోగ దీక్ష ఇచ్చే కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది. ఇంతటి ప్రేమ పూర్వకమైన, ప్రశాంతతో కూడిన, ఆధ్యాత్మిక సౌరభాలు విరజిమ్మే పవిత్ర కార్యక్రమం నేనైతే మరెక్కడా చూడ లేదు, విన లేదు. సత్వ గునాదిక్యత కలిగిన సాధకులకు ఈ దీక్షానుభుతి జీవితాంతం మరువలేని దివ్యానుభూతి. పూర్వ జన్మ సంస్కారాల వల్ల/సత్పురుషుల సాన్గంత్యం వలన/మహనీయుల ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడము వలన ఇలాంటి ఆధ్యాత్మిక సత్సంగాలకు వెళ్ళే సదవకాశం కలుగుతుంది. జీవతం అంటే కేవలం మనము, మన తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, సంపాదన, ఇతరులతో ఆస్తి/అంతస్తుల పోటి, బంధు మిత్రాదులు వంటివి మాత్రమే కాదు. భారతీయ వేదాంతానికి మూల విరాట్టైన ”కర్మ సిద్ధాంతం” ప్రకారం మనకు గత జన్మలు వున్నాయి, మళ్లీ జన్మలు వుంటాయి. ఈ జన్మలో సంపాదించిన భౌతిక పరమైన ఆస్తులు, హోదాలు, భార్య/భర్త బిడ్డలు, చివరకు మన బౌతిక శరీరం కుడా మరణం తర్వాత మన వెంట రావు. కాని వీటి కోసం, వీరి కోసం మనం చేసిన పాపపుణ్యాలు మాత్రం తప్పక మన వెంట జన్మ జన్మలకు వస్తాయి. చేస్తున్న పాపాలు భార్యాబిడ్డలు పంచుకోమని తేల్చి చెప్పాక దారి దోపిడిలు చేస్తున్న వ్యక్తి వాల్మికి మహర్షి అయ్యాడు. మనకు అంత అవసరం లేదులే. కనీసం రవ్వంత ఆధ్యాత్మికతను మన జీవితంలోకి ఆహ్వానించి ముందుకు అడుగులు వేస్తే చాలు. శుకబ్రహ్మాశ్రమం విధ్యప్రకశానందుల వారి గీతామకరంధం, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఆదిశంకరులు, యోగానందులు, వంటి మహనీయులు స్వానుభవంతో రాసిన ఆధ్యాత్మిక పుస్తకాలు శ్రద్ధతో రోజుకో అరగంట చదవడం ఆరంబించడమే మొదటి అడుగు. నా వ్యక్తి గత అభిప్రాయమైతే భగవద్గీత తర్వాత ప్రతి ఇంటా ఉండవలసిన ఆధ్యాత్మిక పుస్తకం ఒక యోగి ఆత్మకథ, ఎందుకంటే ఇందులో పేర్కొన్న కొన్నిధ్యాన విషయాలు, విశ్వరూప దర్శనం, హిమాలయాల్లో ఎప్పటికి వుండే మహాయోగుల విషయాలు, సుక్ష్మ లోక విషయాలు, గురు శిష్య సంభంధాలు మనకు మరెక్కడా కన్పించవు. ఎవరికైనా ఈ పుస్తకం చదివాక డబ్బులు దండగయ్యాయి అనిపించితే పుస్తకం ధరకు రెట్టింపు ధర నేను మీ బ్యాంకు అకౌంటుకు జమ చేస్తాను. ఈలా వ్రాస్తున్నందుకు నన్ను మన్నించండి, నా తపన ఈ పుస్తకంలోని కొన్ని రహశ్యాలు పలువురికి తెలియాలని మాత్రమే.

Tags: Goodbye … goodbye …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *