వైసిపికి సుబ్రమణ్యంరెడ్డి టాటా… – ఆదివారం సంచలన ప్రకటన – భావోద్వేగంతో కన్నీటి పర్యంతం

కుప్పంముచ్చట్లు :

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడు , మాజీ జెడ్పి చైర్మన్‌ సుబ్రమణ్యంరెడ్డి ఆదివారం సంచలన ప్రకటన చేశారు. ఇంత కాలం వైఎస్సాఆర్సీపిలో కొనసాగిన ఆయన హాఠాత్‌నిర్ణయాన్ని అనుచరులు, కార్యకర్తల సమావేశంలో ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. 2013 చివరి నుంచి పార్టీలో కొనసాగుతున్న ఆయన పార్టీ వీడడం వెనుక గుర్తింపు లేదని బహిరంగంగా పేర్కొన్నారు. సుబ్రమణ్యంరెడ్డి 2009 నుంచి చిత్తూరు జెడ్పి చైర్మన్‌గా ఉన్నారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణించిన తరువాత జరిగిన పరిణామాల నేపధ్యంలో ఆయన 2013 లో వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్‌తో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్టా 7నెలలకు ముందే జెడ్పిచైర్మన్‌ పదవికి రాజీనామ చేశారు. తరువాత వైఎస్సాఆర్సీపిలో చేరారు. 2014 ఎన్నికల్లో కుప్పం పార్టీ టికెట్టు తనకే దక్కుతుందని క్రీయాశీలకంగా పని చేశారు. విస్తతంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పరిస్థితులలో బీసీ వర్గానికి టికెట్టు ఇవ్వాలన్న పార్టీ నిర్ణయంతో సుబ్రమణ్యంరెడ్డికి టికెట్టు దక్కలేదు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్‌ చంద్రమౌలిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం , ఎన్నికల్లో పోటీ చేయడం, ఓడిపోవడం చకచక జరిగిపోయాయి. ఎన్నికల తరువాత సుబ్రమణ్యంరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించడం లేదు. ఉరుము ఉరిమినట్టు ఆదివారం కుప్పం నియోజకవర్గ వైఎస్సాఆర్సీపిలో గందరగోళానికి దారి తీసింది. పార్టీకి చెందిన అనుచరులు, సన్నిహితులు, వర్గీయులతో సమావేశం నిర్వహించిన సుబ్రమణ్యంరెడ్డి , వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకున్నారు. పార్టీలో చేరిక, ఆ తరువాత జరిగిన పరిణామాలను వివరించారు. వైఎస్సాఆర్సీపిని వీడుతున్నారని ప్రకటిస్తూ ఆ పార్టీతో అనుబంధం తెగిపోతోందని కన్నీటి పర్యంతమైయ్యారు. తనకు పార్టీ పరంగా సరైన గుర్తింపు, ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కుప్పం నియోజకవర్గ రాజకీయాలలో సుబ్రమణ్యంరెడ్డి ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనేది తెలియాల్సి ఉంది.

Tag : Goodbye to Subramaniam Reddy


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *