అణుదాడికి సిద్దం…!!

ప్యాంగ్‌యాంగ్‌ ముచ్చట్లు :

అమెరికా , దక్షిణ కొరియా , జపాన్‌, గ్వామ్‌ ద్వీపాలే లక్ష్యంగా ఉత్తర కొరియా నియంత కిమ్‌జాంగ్‌ ఉన్‌ అణుబాంబులు విసిరేందుకు సిద్దమయ్యారనే రిపోర్టులు వస్తున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లోని 15 ప్రదేశాలపై అణుదాడి జరగొచ్చని యూరోపియన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఫారిన్‌ రిలేషన్స్(ఈయూఎఫ్‌ ఆర్‌) పేర్కొంది. ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటనలను పలుమార్లు నిశితంగా పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు చెప్పింది. ఉత్తరకొరియా ఎంచుకున్న ప్రదేశాలన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోకొంత గుర్తింపు కలిగినవేనని తెలిపింది. ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థలో ఉన్న సోర్సెస్‌ సాయంతో ఈ సమాచారం సంపాదించగిలిగినట్లు వివరించింది. ఉత్తర కొరియా లక్షిత ప్రాంతాలు ఇలా ఉన్నాయి.
అమెరికాలోని ప్రదేశాలు :వైట్‌హౌస్‌, పెంటగాన్‌, న్యూయార్క్, మన్‌హట్టన్‌, అమెరికా ముఖ్యనగరాలు .
జపాన్‌లోని ప్రదేశాలు : మిసావా, టొక్యో, ఒసాకా, యోకోహామా, క్యోటో.
దక్షిణ కొరియాలోని ప్రదేశాలు : సియోల్‌, బుసాన్‌, గ్యాంన్నెయంగ్‌.

ఈ రిపోర్టును బయటకు వెలువరించడంపై కూడా యూరోపియన్‌ యూనియన్‌ ఫారిన్‌ రిలేషన్స్ వివరణ ఇచ్చింది. ఇలాంటి వాటిని బయటపెట్టడం వల్ల ఉత్తరకొరియాలో మళ్లీ కదలికలు వెహోదలవుతాయని చెప్పింది. అలాంటి పరిస్థితి ఆ దేశం దాడికి ఎప్పుడు దిగుతుందో తెలిసే అవకాశం కలుగుతుందని వివరించింది.

Tag : Got to be a runner … !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *