వెంకటగిరిలో పట్టపగలే చోరీ.

నెల్లూరు ముచ్చట్లు :
నెల్లూరు జల్లా వెంకటగిరి పట్టణము లోని వల్లివేడు క్రాస్ రోడ్డులో నివాసముంటున్న మాతాని నందకుమార్, జమునా రాణి దంపతుల నివాసంలో పట్టపగలే చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలమేరకు తమ స్థలాన్ని ఎవరో ఆక్రమిస్తున్నరని, ఇంటికి తాళం వేసి పోలీసు స్టేషన్ వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాగానే తలుపులు పగులగొట్టి ఉండడాన్ని గుర్తించారు.
తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు ఇనుప రాడ్తో తలుపులు తొలగించి ఇంటిలోకి ప్రవేశించారు. పూజ మందిరంలో ఉన్న వెండి విగ్రహాలు, పడకగదిలో ఉన్న 12 జతల బంగారు కమ్మలు, 2 ఉంగరాలు, 2 సవర్ల గొలుసుతో పాటు, 8వేల రూపాయల నగదు తోపాటు ఎత్తుకెళ్ళారని తెలిపారు.సమాచారం అందుకున్న సీఐ నాగమల్లేశ్వర రావు, యస్ ఐ కోటిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని చోరీ తీరును పరిశీలించారు. అనంతరం నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించింది. కేసు
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కోటి రెడ్డి తెలిపారు. మొత్తం 11సవర్ల బంగారం, కిలో వెండి చోరికి గురైనట్లు బాధితురాలు తెలిపారు.
 
Tags:Graduation theft in Venkatagiri.

Natyam ad