గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్  నేలమట్టం..

-అడ్డుకున్న వ్యాపారస్థులు..పోలీసుల రంగప్రవేశం,
హైదరాబాద్ ముచ్చట్లు:
 
కొత్త పేట్ ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. మార్కెట్ ను వైద్యారోగ్య శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే మార్కెట్ కూల్చివేతను ప్రారంభించింది.  గత 160 రోజులుగా
వ్యాపారులు చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు గండికొట్టారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా ఫ్రూట్ మార్కెట్ ను కూల్చివేశారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తెరవాలంటూ మార్కెటింగ్
శాఖకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 4వ తేదీన ఫ్రూట్ మార్కెట్ ను అధికారులు తెరిచిన విషయం తెలిసిందే. ఇంతలోనే మూడు రోజులు గడవక ముందే మార్కెట్ ను కూల్చివేతలు
చేపట్టారు. మార్కెట్ ఉన్న స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అర్ధరాత్రి హైడ్రామాగడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. మార్కెట్ మూసివేసేందుకు అధికారులు రావడంతో వ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు బందోబస్తు నడుము మార్కెట్ ను స్వాధీనంచేసుకున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు ఫ్రూట్ మార్కెట్ కూల్చివేతలు చేపడుతున్నారని తెలుసుకున్న వ్యాపారులు భారీగా తరలివచ్చారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతోపోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఉదయం 4 గంటల నుండి కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు తెల్లవారేసరికి ఫ్రూట్ మార్కెట్టును నేలమట్టం చేశారు.
1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రజల కోసం 18 ఎకరాల విస్తీర్ణంలో గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు ఇక్కడే తమ
వ్యాపారులు కొనసాగిస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు ఫ్రూట్ మార్కెట్ ను ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తూ వస్తుంది. 2020 లో మార్కెట్ ను కోహెడకు తరలించింది. అక్కడ ఎటువంటి
సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో అప్పట్లో కురిసిన భారీ వర్షాలకు తాత్కాలికంగా వేసిన షెడ్లు నేల కూలాయి. దీంతో తిరిగి ఫ్రూట్ మార్కెట్ ను గడ్డి అన్నారం కి తరలించారు. ఇక గత ఏడాది ఏప్రిల్
నెలలో గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ ను కోహెడకు తరలించి ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని రాష్ట్ర మంత్రులు నిర్ణయించారు. అప్పటి నుంచి మార్కెట్ ను తరలించేందుకు అధికారులు
ప్రయత్నాలు చేస్తూ.. చివరికి మార్కెట్ ను పూర్తిగా మూసివేశారు. దీంతో వ్యాపారులు తమకు కోహెడలో పూర్తి సౌకర్యాలు కల్పించకుండా తరలిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. చివరికి హైకోర్టు ఫ్రూట్
మార్కెట్ ను తెరవాలంటూ వ్యాపారులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ 6 వరకు ఫ్రూట్ మార్కెట్ కొనసాగాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  హై కోర్టు ఉత్తర్వులతో ఈ నెల 4న మార్కెట్ ను
తెరిచిన అధికారులు మూడు రోజులు తిరగకుండానే హై కోర్టు ఉత్తర్వులని లెక్క చేయకుండా రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపట్టడం అందరిని విస్మయానికి గురిచేసింది.
 
Tags:Grass said the fruit market is level

Natyam ad