ఘనంగా 64 వ అఖిల భారత సహకార వారోత్సవాలు

పెద్దపంజాణి ముచ్చట్లు

అఖిల భారత సహకార బ్యాంకు సంఘం యొక్క 64 వ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల కేంద్రంలోని సహకార సంఘ కార్యాలయంలో సహకార సంఘ అధ్యక్షుడు ఎన్.శంకరప్ప,సీఈఓ రామరాజు ఆద్వర్యంలో ఈ వారోత్సవాలు నిర్వహించారు. జిల్లా సహకార బ్యాంకు డిజిఎం లిల్లీ కేథరీన్ ముఖ్య అతిధిగా పాల్గొని సహకార సంఘ బ్యాంకు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసమే సహకార బ్యాంకింగ్ సంస్థ ఏర్పడిందన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే సహకార బ్యాంకుల ద్వారా సన్న, చిన్నకారు రైతుల అభివృద్ధి కోసం పలు రకాల రుణ సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రైతులకు వడ్డీ లేని రుణాలతో పాటు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలకు వడ్డీ పై రాయితీ వంటి కార్యక్రమాలు చేపడుతన్నామని ఆమె తెలిపారు. ఇప్పటికే మండల పరిధిలో 6857 మంది రైతులు సహకార సంఘంలో సభ్యులు గా ఉన్నారని చెప్పారు. వీరిలో సుమారు వెయ్యి మంది రైతులకు రుణాలు మంజూరు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజనల్ కోఆపరేటివ్ బ్యాంకు అధికారులు ఆరీఫుల్లా,జయలక్ష్మి,పుంగనూరు బ్రాంచి మేనేజరు రాధారాణి,సూపర్ వైజర్ నాగప్రసాద్,సీఈఓ రామరాజు,మునిరాజు,రైతులు పాల్గొన్నారు.

Tag : Greatly 64th All India Co-operative Weeks


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *