Green signal to pay the bills in treasuries

ట్రెజరీల్లో బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Date: 20/12/2017
అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రెజరీల్లో నిధులు జమ కావడంతో చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి ట్రెజరీల్లో అన్ని రకాల బిల్లులను చెల్లించనున్నారు. రెండు నెలల నుంచి జీతాలు, పెన్షన్ బిల్లులే మంజూరు చేస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మరోవైపు, 2018-19 బడ్జెట్ అంచనాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బుధవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులకు హెచ్వోడీలతో సీఎస్ దినేష్కుమార్ సమావేశం కానున్నారు.
Tag: Green signal to pay the bills in treasuries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *