గ్రేహౌండ్స్ జవాను ఆత్మహత్య.

విశాఖ ముచ్చట్లు:
నగరంలోని పోతిన మల్లయ్య పాలెం శివశక్తి నగర్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి తన ఇంట్లో కానిస్టేబుల్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సురేష్ ఆత్మహత్యకు పాల్పడే ముందు తన భార్యతో వీడియోకాల్ మాట్లాడినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పీఎం పాలెం పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
 
Tgs:Greyhounds Javanese suicide

Natyam ad