చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి-నటి పూనం కౌర్

తిరుమల ముచ్చట్లు:
 
చేనేత పరిశ్రమపై జీఎస్టీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రముఖ సినీనటి పూనం కౌర్‌. తిరుమల వచ్చిన ఆమె.. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.నైవేద్య విరామ సమయంలో ఆమె శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనాంతరం ఆమెకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు పూనమ్‌ కౌర్.దేశంలో చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు తొలగించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. చేనేతలు బాగుండాలంటూ మరికొన్ని పుణ్యక్షేత్రాలు సందర్శిస్తానని తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags; GST should be abolished on handloom: Actress Poonam Kaur

Natyam ad