మోడ్రన్ ఫెసెలీటలతో గురుకుల పాఠశాలలు

Date:12/03/2018
ఖమ్మం ముచ్చట్లు:
గురుకులాల పాఠశాలలు… కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలను తలదన్నేలా మారుతున్నాయి. నెలకు నాలుగుసార్లు చికెన్, రెండు సార్లు మటన్, ప్రతి రోజూ ఉదయం బొర్నవిటాతోపాటు మధ్యాహ్న భోజనంలో నెయ్యితోపాటు చట్నీ, నూడిల్స్, పకోడీ వంటి అదనపు పదార్థాలు అందిస్తోంది. వీటితోపాటు గిరిజన విద్యార్థుల విజ్ఞానం మరింత అభివృద్ధి చెందేందుకు గాను రూ.12.29 లక్షలతో సైన్స్ ల్యాబ్ పరికరాలు, రూ.10.85 లక్షలతో గ్రంథాలయ పుస్తకాలు, ఇనుప బీరువాలు, రెండు జిల్లాల్లోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఫర్నీచర్, వంట పాత్రలు తదితరాల కొనుగోలు నిమిత్తం రూ.52.30 లక్షలు వెచ్చించింది. విద్యతోపాటు సకల సౌకర్యాలూ కల్పిస్తోంది. ఏడాదికి మూడు జతల యూనీఫామ్‌తోపాటు బెడ్‌షీట్స్, టవల్స్ దగ్గర నుంచి ప్లేట్లు, గ్లాసుల వరకూ సకలం అందిస్తోంది. 2016-17 విద్యా సంవత్సరంలో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మొత్తం 496 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా 85.48 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రతిభా పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. దమ్మపేట గురుకులం వంద శాతం ఫలితాలతో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. గిరిజన గురుకుల రాష్ట్రస్థాయి మొదటి 4వ ర్యాంకులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థులు సాధించడం గర్వకారణం. 2016-17 విద్యా సంవత్సరంలో గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 839 మంది పరీక్షలకు హాజరుకాగా 719 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 85.70 శాతం ఉత్తీర్ణత సాధించి గతం కంటే ఆరు శాతం అధికంగా నమోదు చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అంకంపాలెం కళాశాల విద్యార్థిని నందిని హెచ్‌ఈసీలో 5వ ర్యాంకు, ఎస్‌వోఈ విద్యార్థి అరవిందకుమార్ ఎంపీసీలో 463 మార్కులతో టాపర్‌గా నిలవడం గర్వకారణం. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎస్‌వోఈ విద్యార్థిని డీ.పావని ఎంపీసీలో వెయ్యి మార్కులకు గాను 973 మార్కులు సాధించి మూడో ర్యాంకులో నిలిచింది. బైపీసీలో బీ.నరేందర్ 955 మార్కులు, అంకంపాలెం విద్యార్థిని వీ.సునీత సీఈసీలో 903 మార్కులతో మొదటి ర్యాంకులను గురుకులం స్థాయిలో సాధించారు. 2016-17 సంవత్సరంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఖోఖో పోటీలలో కిన్నెరసాని జూనియర్ కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి కే.అన్వేష్ సిల్వర్ మెడల్ సాధించాడు. గిరిజన గురుకుల పాఠశాల గుండాల, భద్రాచలం, సుదిమళ్ల నుంచి ఒక్కో విద్యార్థి 12000 అడుగుల ఎత్తు ఉన్న కులుమనాలి పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల అడ్మిషన్లు ఏటేటా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న విద్యాసంస్థలతోపాటు ఈ విద్యాసంవత్సరం నుంచి మూడు డిగ్రీ కళాశాలలు (దమ్మపేట, కొత్తగూడెం, మణుగూరు), ఒక ఏకలవ్య మోడల్ గిరిజన గురుకులం (గండుగులపల్లి) ప్రారంభమయ్యాయి. రెండు జిల్లాలకు మొత్తం 23 విద్యాలయాలు నిర్వహిస్తున్నారు. 2017-18 విద్యా సంవత్సరంలో గిరిజన గురుకుల పాఠశాలల్లో 3955, కళాశాలల్లో 2017, డిగ్రీ కళాశాలల్లో 318, మినీ గురుకులంలో 180 మంది కలిపి మొత్తం 6600 మంది గిరిజన, గిరిజనేతర బాలబాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం విద్యార్థులకు యోగా, వ్యాయామాలతోపాటు బూస్ట్ సౌకర్యం కల్పిస్తారు. తరువాత విద్యార్థులు స్నానం ఆచరించి ఉదయకాలపు పర్యవేక్షణ తరగతులకు హాజరవుతారు. తరువాత రకరకాల అల్పాహారాలు (నూడిల్స్, పూరీ, బోండా, ఇడ్లీ, పులిహోర, కిచిడీ) తీసుకుంటారు. తరువాత దినచర్యలో భాగంగా తరగతులకు హాజరవుతారు. పాఠశాలలో తరగతులతోపాటు ఇంగ్లిష్ క్లబ్, డబ్ల్యూ+ క్లబ్, టీ+ క్లబ్, అంకుర్, ఆపరేషన్ ఐన్‌స్టీన్, స్పెల్‌బీ, ఇన్నర్ హౌసెస్ కాంప్లిటేషన్, ఇగ్నైట్, యూత్ పార్లమెంట్, కల్చరల్ ఫెస్ట్, జోనల్, స్టేట్ లెవల్ గేమ్స్ అండ్ ఇంటర్ సొసైటీ లీగ్, సైన్స్ ఫెయిర్, అడ్వెంచర్ స్పోర్ట్స్ పేరుతో రాక్ ైక్లెంబింగ్, భారత్ దర్శన్, మిర్రర్ ప్రాజెక్టు, కారదీపత్, ఫ్లిప్పుడ్ క్లాసెస్, సెమినార్ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.
Tags: Gurukkal schools with modern facsimile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *