శాసనమండలి ఛైర్మన్ గా గుత్తా ఎన్నిక..

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. సుఖేందర్ రెడ్డి ఒక్కరె నామినేషన్ వేయడంతో మండలి చైర్మన్ గా ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నిక అనంతరం సుఖేందర్ రెడ్డి చైర్మన్ స్థానంలో కూర్చొన్నారు. ఆయనకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలను ఈ సందర్భంగా మంత్రులు కొనియాడారు..

Natyam ad