డ్రగ్స్ కేసులో గుట్టు రట్టు

హైద్రాబాద్ ముచ్చట్లు:
 
డ్రగ్స్‌ కేసులో విచారణ చేసే కొద్ది కీలక విషయాలు బయటపడుతున్నాయి. టోనీ వాట్సాప్‌లో మరికొంత మంది వ్యాపారవేత్తల కాంటాక్టులు బయటపడ్డాయి. హైదరాబాద్‌తోపాటు పుణె, ముంబైకి చెందిన బడా వ్యాపారవేత్తలు బాగోతం బట్టబయలైంది. అంతేకాకుండా హైదరాబాద్‌కు చెందిన కొంతమంది వ్యాపారస్తులు రెండేళ్లుగా టోనీ నుంచి కొకైన్‌ను తెప్పించుకున్నట్లు తేలింది. ఇక అరెస్ట్ అయిన ఏడుగురు వ్యాపారవేత్తలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారంతా బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.అటు టోనిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతోపాటు, ఇంటెలిజెన్స్ పోలీసులు నాలుగు రోజులుగా సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయినా ఏడుగురు వ్యాపారవేత్తలతో పాటు హైదరాబాద్‌కు చెందిన మరో ఆరుగురు బడా వ్యాపారవేత్తలతో టోనీకి సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఆరుగురు వ్యాపారులు కూడా రెండేళ్లుగా కొకైన్‌ను కోడ్ లాంగ్వేజ్ ద్వారా ఆర్డర్ చేసి నగరానికి తెప్పించుకున్నట్లు తేలింది. ఇక హైదరాబాద్ వ్యాపారవేత్తలతో పాటు ముంబై, పుణెకు చెందిన వ్యాపారాలు టోనీ నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.పూణెలో రెండు ఖరీదైన రిసార్ట్‌లు, రెండు పబ్‌లకు కొకైన్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ డ్రగ్స్‌ దందాను నాలుగేళ్లుగా నిర్వహిస్తూ.. రెండేళ్లుగా కొకైన్‌ విక్రయాలను 15 రేట్లు పెంచినట్లు సమాచారం. ఇక హైదరాబాద్‌లో నెలకు 15 నుంచి 20 లక్షల విలువైన కొకైన్‌ను తన ఏజెంట్లు ద్వారా టోనీ సరఫరా చేసేవాడిని పోలీసులు గుర్తుచేశారు.
 
Tags: Guttu Rattu in Drugs Case

Natyam ad