హోదాను అడ్డుకుంటున్న జీవీఎల్-ఎం.పి. మార్గాని భరత్  ..

రాజమండ్రి ముచ్చట్లు:
 
తెలుగువారై ఉండి బీజెపీ ఎం.పి జీవీఎల్  ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారు . కేంద్ర హోంశాఖ  అజెండా నుంచి ప్రత్యేకహోదా డిలీట్  కావడానికి జీవీఎల్ కారణమని ఎంపి మార్గాని భరత్ ఆరోపించారు.
ఈనెల 17న కేంద్ర హోంశాఖ సమావేశంలో  తొలగించిన ప్రత్యేకహోదా  అంశాన్ని చేర్చాలి. ఎ.పి.కి  ప్రత్యేకహోదా  ఇవ్వాలని కేసీఆర్ కూడా చెప్పారు. ఎ.పి.కి అన్యాయంపై 22 మంది వై.సి.పి ఎం.పి.లం
అనేకసార్లు పార్లమెంటులో  మాట్లాడామని అయన అన్నారు. వై.సి.పి ఎం.పిలం మాట్లాడటం వల్లే  ప్రధాని మోదీ ఆంధ్రాకు అన్యాయం జరిగిందని అన్నారు. కోడలు మగబిడ్డను  కంటానంటే అత్తగారు
వద్దంటుందా  అని  చంద్రబాబు మహిళల్ని  అవహేళన చేశారు. ఏ మొఖం పెట్టుకుని  టిడిపి మహిళలు దీక్షలు చేస్తున్నారు? పోలవరం ప్రాజెక్టుకు  కేంద్రం 2,100 కోట్లు రీఎంబర్స్   చెయ్యాల్సి ఉంది.
ఎ.పి.లో  కొత్త జాతీయ రహదార్లు  వేస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు. కేంద్రం క్రెడిట్ మేము తీసుకోమని అయన అన్నారు.
 
Tags: GVL-MP blocking status. Margani Bharat ..

Natyam ad