జీవీఎంసీ భేటీ రసాభాస

విశాఖపట్నం ముచ్చట్లు:
జీవీఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడాన్ని ఖండిస్తూ టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ప్రదాన కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఇందిర ప్రియ దర్శిని స్టేడియం, నరవ లో 24ఎకరాలు భూములు ని తాకట్టు పెట్టి 164కోట్లు రూపాయలు రుణం తేవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ రోజు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ఈ తీర్మానాన్ని అడ్డుకుంటామని తెలిపారు. సభను స్థంభింప చేస్తామని హెచ్చరించారు. జీవీఎంసీ ఆస్తులు తో పాటు విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అతిది  గృహాలు కూడా   తాకట్టు పెట్టేయడం దారుణం అని విమర్శించారు.అనంతరం ప్రారంభం అయిన  కౌన్సిల్ సర్వ సభ్య  సమావేశం రసా భస గా సాగింది .జీరో హవర్ సమయాన్ని పెంచాలని విపక్ష సభ్యులు మేయర్ పోడియం చుట్టు ముట్టారు .దీంతో అధికార, విపక్ష సభ్యులు మద్య వాగ్వాదం చోటు చేసుకుంది.
 
Tags:GVMC meeting rhetoric

Natyam ad