తిరుమలలో హనుమాన్ జన్మస్థలం భూమి పూజ పనులను పరిశీలించిన అదనపు ఈవో
తిరుమల ముచ్చట్లు:
ఫిబ్రవరి 16న తిరుమలలో ఆకాశ గంగ సమీపంలోని హనుమాన్ జన్మస్థలంలో భూమి పూజ నిర్వహించేందుకు చేప్పటిన పనులను అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.ఇందులో భాగంగా భూమి పూజ నిర్వహించే ప్రాంతం, పరిసరాలు, ప్రముఖులు కుర్చునే వేదికను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా భక్తులు, మీడియాకు అవసరమైన పోడియం, తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఆకాశగంగ వద్ద పుష్పాలతో అందంగా ముస్తాబు చేయాలని, భూమి పూజ జరిగే పరిసరాల్లో మెరుగైన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.టిటిడి సిఇ నాగేశ్వరరావు, ఎస్ ఇ – 2 జదీశ్వర్ రెడ్డి, ఇఇలు జగన్మోహన్ రెడ్డి, సురేంద్ర నాథ్ రెడ్డి, ఇన్చార్జ్ డిఎఫ్వో ప్రశాంతి, ఆరోగ్య విభాగం అధికారిణి డా.శ్రీదేవి, అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జన్ డా. కుసుమకుమారి, వైఖానస ఆగమ సలహదారులు మోహన రంగాచార్యులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు రాణి సదాశివమూర్తి, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, మాజీ టిటిడి బోర్డు సభ్యులు (దాత) నాగేశ్వరరావు, విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు ఉన్నారు.
Tags: Hanuman’s birthplace in Thirumala Bhoomi Puja