ఒకే వ్యక్తిని పెళ్లాడిన ముగ్గురు కవలలు..

ఆంజనేయులు న్యూస్: కాంగో దేశానికి చెందిన లువిజో అనే వ్యక్తి ఒకే రోజు ముగ్గురు కవలలను పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటగా అతడు ఒకరినే ప్రేమించాడు. కానీ చివరకు ముగ్గుర్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నటాలీ అనే అమ్మాయి లువిజోకు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేవారు. అయితే కొన్ని రోజులకు నటాలీతో పాటు అచ్చం ఆమెలాగే ఉన్న మరో ఇద్దరిని తాను కలుస్తున్నట్లు తెలుసుకుని అతడు షాకయ్యాడు. నటాలీ లాగే ఉన్న నటాషా, నడెగేలను అతడు గుర్తించలేకపోయాడు. ఇలా తెలియకుండానే అతడు మిగిలిన ఇద్దరినీ ప్రేమించాడు. ఆ ముగ్గురు యువతులు కలిసి ఒకరోజు లువిజో దగ్గరికి వచ్చి ముగ్గురం ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని అసలు విషయం చెప్పారు. దీంతో లువిజో వారి మాటను కాదనలేక ముగ్గుర్ని వివాహమాడాడు.

Natyam ad