మహిళాపోలీస్ కు వేధింపులు..

-తక్షణమే స్పందించిన విజయవాడ సిపి కాంతిరానా…
-వేధింపులకు గురి చేసిన హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ సస్పెండ్.
.
-బాధితురాలికి అండగా నిలిచిన బెజవాడ పోలీసులు.
విజయవాడ ముచ్చట్లు:
నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ కు తన సహచర పోలీసుల నుంచే వేధింపులు తీవ్రమయ్యాయి. ఈ వేధింపులను సంబంధిత స్టేషన్ అధికారుల ద్వారా నగర పోలీస్ కమిషనర్ కు చేరవేయడం జరిగింది అంతే క్షణాల్లో స్పందించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానా, ఆగమేఘాలమీద స్పందించి ఆదేశాలు జారీ చేశారు. బాధిత మహిళకు బెజవాడ పోలీసు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళా పోలీస్ ను వేధిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ ను సస్పెండ్ చేశారు. అదే సందర్భంలో తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. వేధింపులకు గురి చేయటం మరొకసారి జరిగితే, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బెజవాడ పోలీసులలో ఈ చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బాధిత మహిళా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు, తన సమస్యపై తక్షణమే స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
 
Tags:Harassment to women police

Natyam ad