Haridak Pandya and Keel Rahul

హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ పై వేటు 

Date:11/01/2019
ముంబై ముచ్చట్లు:
ఆస్ట్రేలియాతో శనివారం ఉదయం నుంచి ప్రారంభంకానున్న తొలి వన్డే‌‌కి భారత్ దాదాపు తుది జట్టుని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గాయం నుంచి ఇటీవల కోలుకుని జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న హార్దిక్ పాండ్యాపై వేటు వేసిన టీమిండియా మేనేజ్‌మెంట్.. ప్రత్యామ్నాయ ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ని అసలు పరిగణలోకి కూడా తీసుకోలేదట. దీంతో.. ఈ ఇద్దరు క్రికెటర్లూ రేపు తొలి వన్డే‌లో ఆడే అవకాశాలు లేవని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు.. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’‌ టాక్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకే వీరిని టీమిండియా మేనేజ్‌మెంట్ పక్కనపెట్టబోతున్నట్లు వినికిడి.విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌‌ని పక్కనపెడితే.. తొలి వన్డే‌కి భారత్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్.. ఆ తర్వాత మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగులో అంబటి రాయుడు, ఆ తర్వాత దినేశ్ కార్తీక్ ,కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ లేదా సిరాజ్‌తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశం ఉంది.

ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేయడం సరికాదు :
భారత యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సరదాగా మాట్లాడిన మాటలకి ఇంత రాద్ధాంతం చేయడం తగదని అతని తండ్రి హిమాన్షు పాండ్య అభిప్రాయపడ్డాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి ఇటీవల హాజరైన హార్దిక్ పాండ్య అక్కడ సరదాగా అమ్మాయిలు, డేటింగ్ గురించి అడిగిన ప్రశ్నలకి వివాదాస్పదరీతిలో బదులిచ్చాడు. తాను తొలిసారి శృంగారంలో పాల్గొన్న విషయం తల్లిదండ్రులకి చెప్పానని షోలో చెప్పుకొచ్చిన ఈ ఆల్‌రౌండర్.. పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపైనా అభ్యంతరకరంగా మాట్లాడాడు. హార్దిక్‌తో పాటు ఆ షోకి హాజరైన కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు’ అంటూ ప్రశంసించాడని చెప్పుకొచ్చాడు.
దీంతో ఈ ఇద్దరిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగగా.. కనీసం రెండు వన్డేల నిషేధం విధించాలని బీసీసీఐ పరిపాలక కమిటీ ఇటీవల ప్రతిపాదించింది. హార్దిక్ పాండ్యాపై రెండు వన్డేల నిషేధం ప్రతిపాదన వార్త వెలుగులోకి రావడంతో అతని తండ్రి హిమాన్షు పాండ్యా తాజాగా స్పందించాడు. ‘హార్దిక్ పాండ్య కామెంట్స్‌ని ప్రేక్షకులు ఎందుకు ఇంత సీరియస్‌గా తీసుకుంటున్నారో..? నాకు అర్థం కావడం లేదు. అదొక ఎంటర్‌టైన్‌మెంట్ షో.. కాబట్టి.. హార్దిక్ సరదాగా ఆ కామెంట్స్ చేశాడు. అక్కడ అభిమానుల్ని అలరించాలనే ఉద్దేశంతో మాత్రమే హార్దిక్ అలా మాట్లాడాడు. కాబట్టి.. వాటిని ఎవరూ సీరియస్‌ లేదా తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అతను చాలా అమాయకుడు. అలానే.. సరదా మనిషి కూడా’ అని హిమాన్షు చెప్పుకొచ్చాడు.
Tags:Haridak Pandya and Keel Rahul

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *