జెసిఐ జాతీయ సమన్వయ కర్తగా హర్షవర్ధన్ రెడ్డి!

తిరుపతి  ముచ్చట్లు:

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జెసిఐ) ఇండియా, జాతీయ క్రియేటివ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ (సివైఇ) సమన్వయ కర్తగా ఎన్ బి హర్షవర్థన్ రెడ్డి నియమితులయ్యారు. ఆ మేరకు జెసిఐ ఇండియా జాతీయ అధ్యక్షుడు అన్షు షరాఫ్ నియామక ఉత్తర్వులు పంపారు. దేశంలోని సృజనాత్మక యువ పారిశ్రామిక వేత్తలకు సరైన మార్గదర్శనం చేయడం, సలహాలు ఇవ్వడం అయన ప్రధాన బాధ్యత. అలాగే వారిలోని ప్రతిభ ఆధారంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డుల సాధనకు తోడ్పాటు అందించ వలసి ఉంటుంది. తిరుపతికి చెందిన అయన గతంలో జెసిఐ జోన్ 4 (ఏపీ) అధ్యక్షునిగా , ఆసియా పసిపిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధికారిగా పనిచేశారు. ఆయన నియామకం పట్ల జెసిఐ తిరుపతి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
 
Tags;Harshavardhan Reddy as JCI National Coordinator!

Natyam ad