Haul Chalal in Tirumala

తిరుమలలో మందుబాబు హల్ చల్

Date:09/01/2018

తిరుమల ముచ్చట్లు:

పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. వరాహ స్వామి అతిధి గృహం వద్ద గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలు అందరూ చూస్తుండగానే మందు తాగుతూ ఏం చేస్తారో చేసుకోండంటూ భక్తులకు సవాలు విసరడం గమనార్హం. మందుబాబు హల్ చల్ చేస్తున్నా విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో మద్యం, మాంసానికి అనుమతి లేకున్నా..సదరు వ్యక్తికి మాత్రం మద్యం ఎక్కడి నుంచి లభించిందని భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉపరాష్ట్రపతి తిరుమల పర్యటన నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఇప్పటికే వెల్లడించింది. అయితే నిషేదిత వస్తువులు మాత్రం ఎప్పటికప్పుడు తిరుమలకు యదేచ్చంగా తరలిస్తూనే ఉన్నారు.విజిలెన్స్ అధికారులు ఇప్పటికైనా మేలుకొని ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.

Tags :Haul Chalal in Tirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *