‘అ’లో కాజల్‌ అగర్వాల్‌ని చూశారా?

ఈనాడు.

Date : 31/12/2017

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం ‘అ’. ఇప్పటికే ఇందులో రెజీనా, రవితేజ, నిత్యామేనన్‌, అవసరాల శ్రీనివాస్‌ ఫస్ట్‌లుక్‌లను విడుదల చేశారు. ఇప్పుడు సినిమాలోని కాజల్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. గులాబీ పువ్వును పట్టుకుని దిగాలుగా చూస్తున్న కాజల్‌ ఫొటోను వివిధ ఫ్రేమ్‌లలో చూపించారు. ఇందులో కాజ‌ల్ కాళీ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో నాని ఓ చేపకు, రవితేజ ఓ మొక్కకు వాయిస్‌ ఓవర్‌ ఇస్తు్న్నారు. ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags : Have you seen Kajal Aggarwal in ‘A’?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *