He is singing ... Madhuram

ఆయన గానం… మధురం

Date: 24/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

మహమ్మద్‌ రఫీ… ప్రముఖ ఉత్తర భారత నేపధ్య గాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతి పెద్ద తారగా విలసిల్లినవాడు. సంగీతాభీమానులందరికీ చిరపరీచితుడు ఆయన రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషలలో పాటలు పాడారు. 17 భాషలలో తన గానంతో అబ్బురపరచాడు. హిందీ సినిమా (బాలీవుడ్‌) జగతులో గుర్తింపబడ్డారు. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన గాయకుడు. హిందీ సినిమా గాన జగతులో 1950 కాలం మహమ్మద్‌ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు. రఫీ మరియు లతా మంగేష్కర్‌ల గాయక జోడీ, హిందీ నేపధ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది. కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి. రాజేంద్రకుమార్‌, షమ్మీ కపూర్‌ రఫీ పాటలతోనే హిట్టయ్యారు. రాజేంద్ర కపూర్‌ల కాలం సువరాక్షరాలతో లిఖింపదగ్గది. పంజాబ్‌లోని కొట్లా సుల్తాన్‌ పూర్‌లో జన్మించాడు. తండ్రి హాజి అలి మహమ్మద్‌. రఫీ హిందుస్థానీ క్లాసికల్‌ సంగీతం ఉస్తాద్‌ బడే గులాం అలీ ఖాన్‌, ఉస్తాద్‌ అబ్దుల్‌ వహీద్‌ ఖాన్‌, పండిత్‌ జీవన్‌ లాల్‌ మట్టూ మరియు ఫీరోజ్‌ నిజామిల వద్ద నేర్చుకున్నాడు. ఒక రోజు తన మామ హమీద్‌ తోడు ప్రఖ్యాత గాయకుడు కె.ఎల్‌. సెహ్‌ గల్‌ గానకచ్చేరి చూడడానికి వెళ్ళాడు. విద్యూత్‌ అంతరాయం వలన సెహ్‌ గల్‌ పాడడానికి నిరాకరించాడు. హమీద్‌ నిర్వాహకుల అనుమతి పొంది రఫీను పాడనిచ్చాడు. అప్పుడు రఫీ వయస్సు 13 సంవత్సరాలు. శ్యాంసుందర్‌ అనే సంగీతకారుడు రఫీని గుర్తించి పంజాబీ సినిమా (1942) గుల్‌ బలోచ్‌లో జీనత్‌ బేగం తోడుగా పాడనిచ్చాడు. రఫీతో జగ్గయ్య తొలి సారి తెలుగులో పాడించారు. భక్త రామదాసు(నాగయ్య) చిత్రంలో కబీరు (గుమ్మడి) పాత్రకు నేపధ్యగానం చేశారు. ఎన్‌.టి.రామారావు కుటుంబ సభ్యులు ముగ్గురికి (ఎన్‌.టి. ఆర్‌, హరికృష్ణ, బాలకృష్ణ,లకు) రఫీ పాటలు పాడారు. షకీల్‌ బదాయూనీ రచన చేస్తే నౌషాద్‌ సంగీత దర్శకత్వం వహిస్తే రఫీ గానంచేస్తే ఇలాంటి భజన్‌లే వుంటాయి మరి.
హరీ ఓం, మన్‌ తడ్‌ పత్‌ హరీ దర్షన్‌ కో అజ్‌ (నైజూ బావరా)

Tag: He is singing … Madhuram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *