కొడాలి నాని వ్యవహారంతో తలనొప్పి

విజయవాడ ముచ్చట్లు:
 
కొడాలి నాని చంద్రబాబుకు కొరుకుడు పడని నేత. విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్న నాని టార్గెట్ అంతా చంద్రబాబు మాత్రమే. నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన నానిని కమ్మ సామాజికవర్గం నుంచి గత ఎన్నికల్లో వేరు చేయాలని చూసినా అది సాధ్యం కాలేదు. నానికి పార్టీలకతీతంగా అభిమానించే వారు ఉండటమే అందుకు కారణం. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని పేరు పెట్టి పిలిచే వారు అనేక మంది ఉంటారు. వీరంతా ఏ సామాజికవర్గమైన నానిపై వ్యక్తిగత అభిమానంతోనే ఆయనకు వెన్నంటి ఉంటారు.నియోజకవర్గంలో కొడాలి నాని ఒకరి దగ్గర చేయి చాచరు. ఎవరు ఏమి అడిగినా కాదనరు. తనను అభిమానించే వారిని ఎంత ప్రేమిస్తారో వ్యతిరేకించే వారు అంత ధ్వేషిస్తారు. అలాంటి కొడాలి నాని తన సామాజికవర్గమైనా తలనొప్పిగా మారాడన్నది చంద్రబాబు ఆలోచన. గుడివాడను కొట్టగలిగితే జిల్లాలో అన్ని నియోజకవర్గాలు తమ చేతికి వస్తాయని చంద్రబాబు అంచనా. అందుకోసమే కొడాలి నాని విషయంలో ఏ చిన్న విషయంపైనైనా చంద్రబాబు తన టీంను రంగంలోకి దింపుతారు. గుడివాడలో క్యాసినోను ఏర్పాటు చేశారన్నది టీడీపీ ప్రధాన ఆరోపణ. కొడాలి నాని ఐదు వందల కోట్లు సంపాదించారని విమర్శలు చేస్తున్నారు. కేవలం మూడు రోజుల్లో ఐదు వందల కోట్లు సంపాదించడం సాధ్యమేనా? నమ్మశక్యంగా లేదు. అయినా టీడీపీ నేతలు చెబుతుండటంతో నమ్మాల్సిందే. అయితే కొడాలి నాని గత నెల 6వ తేదీన కరోనా సోకడంతో ఆయన హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చేరారు. అక్కడ వారం రోజులున్నారు. పండగ తర్వాత మాత్రమే కొడాలి నాని గుడివాడ వచ్చారు. . తన కె కన్వెన్షన్ సెంటర్ లో అసలు క్యాసినో ఏర్పాటు చేయలేదని, నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. అయితే ఈ విషయాన్ని వదిలిపెట్టబోమని, న్యాయస్థానాలను అయినా ఆశ్రయిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కొడాలి నానిని కట్టడి చేయడానికి టీడీపీకి క్యాసినో అంశం ఆయుధంగా దొరికిందనే చెప్పాలి. అయితే వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు కాని కొడాలి నాని మాత్రం కొరుకుడు పడకపోవడం వల్లనే టార్గెట్ అయ్యాడని చెప్పాలి.
దాడులను అరికట్టాలి
Tags: Headache with Kodali Nani affair

Natyam ad