Hearing of the victims for the Community Hall

కమ్యూనిటీ హాలుకోసం బలిజకులస్తుల వినతి

Date: 10/12/2017
పలమనేరు ముచ్చట్లు:
పలమనేరు పట్టణంలోని బలిజకులస్తులు తమకు కమ్యూనిటీ హాలు నిర్మించాలని మంత్రి అమరనాథ్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కాపు,బలిజ,తెలగ కులస్తులను తెదేపా ప్రభుత్వం బీసీ జాబితాలో చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై బలిజ అభ్యదయ సేవా సంఘం నాయకులు మంత్రికి శాలువా కప్పి, గజ పూలమాలతో సన్మానించారు. అదేవిధంగా ఎక్స్‌ప్రెస్ హైవే బాధితులు మంత్రిని కలిసి పరిహారం పెంచాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షుడు సుధాకర్,పిజెసి బాబు,ఎకె మూర్తి,సుబ్బనాగయ్య, అమ్ములు, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
 Tag: Hearing of the victims for the Community Hall

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *