Hearing places for bee buildings

బీసీ భవనాలకు స్థలాలు కేటాయించాలని వినతి

Date: 02/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

హైదరాబాద్ 66 బి.సి కుల సంఘాల భవనాలకు స్థలాల కేటాయించాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసారు. ఈమేరకు సోమవారం ముక్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాసారు. తమరు ఎంతో ఉదార హృదయంలో మొన్న కురుమ గొల్ల, యాదవ హాస్టల్‌కు 10 ఎకరాల స్థలం- 10 కోట్లు మంజూరు చేసి శంఖుస్థాపన చేశారు. అలాగే ఇటీవల రెడ్డి హాస్టల్‌కు 15 ఎకరాల స్థలం, 15 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అలాగే వీరశైవులకు, క్రిస్టియన్లకు కేటాయించారు. అందుకు కృతజ్ఞతలు తెలిపారు. బి.సి జాబితాలో 112 కులాలు ఉన్నప్పటికీ ఉనికిలో ఉన్న దాదాపు 66 కులాలకు కూడా హాస్టళ్ళకు, కమ్యూనిటి హళ్ళకు భవనాలు లేవు. ఈ కులాల వారికి కూడా హాస్టళ్ళకు, భవనాలకు స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేసారు.మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, పద్మశాలి, విశ్వ బ్రాహ్మణ, వడ్డెర, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, ఉప్పర, రజక (చాకలి), నాయి బ్రాహ్మణ (మంగళి), పెరిక, మేదర, మేర, బెస్త, పూసల, జంగం, లింగాయత్, వీర భద్రియ, బట్రాజు, అరెకటిక, గాండ్ల, వంజరి, వంశీరాజ్, వాల్మీకి, పూసల, తమ్మలి, వారాల తదితర 66 కులాలకు అలాగే మాల, మాదిగ, లంబాడి, ఎరుకల, యానాది, గోండు తదితర కులాలకు ఒక్కొక్క కులానికి 10 ఎకరాల స్థలం, 10 కోట్లు బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేసారు. 90 శాతం కులాలకు హైదరాబాదు లో గజం స్థలం లేదు. భవనాలు లేవు- హాస్టళ్ళు లేవు. ప్రజాస్వామ్యంలో ప్రతి సామాజిక వర్గానికి, రాష్ట్ర రాజధానిలో వారి పిల్లలు చదువుకునేందుకు హాస్టళ్ళు, సభలు-సమావేశాలు, వివాహాలు, ఇతర శుభకార్యాలు జరుపుకోవడానికి కమ్యూనిటి హాళ్ళు మంజూరు చేయాలనీ విజ్ఞప్తి చేసారు.ఈ కులాలకు హాస్టళ్ళు-కమ్యునిటీ భవనాలు కట్టుకోవడానికి స్థలం, బడ్జెట్ కేటాయిస్తే అన్ని కులాలను గౌరవించినట్లు అవుతుందని కొందరికి ఇచ్చి-కొందరికి ఇవ్వకపోతే రానటువంటి కులాలకు అన్యాయం చేసిన వారమవుతామని పేర్కొన్నారు. ప్రతి కులంకు ఇచ్చి గౌరవిస్తే తమ గౌరవం-కీర్తి-ప్రతిష్టలు పెరుగుతాయని,అలాగే ప్రభుత్వ అద్వర్యంలో నడిచే బి.సి/యస్.సి/యస్.టి కాలేజీ హాస్టళ్ళు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయన్నారు. 250 బి.సి కాలేజీ హాస్టళ్ళు,170 యస్.సి కాలేజీ హాస్టళ్ళు, 102 యస్.టి కాలేజీ హాస్టళ్ళు అద్దె భవనాలలో వసతి ,సౌకర్యాలు సరిపోను లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవతున్నారని, ఇంజనీరింగ్,మెడిసిన్,ఫార్మసీ కోర్సులు చదివే వీరు ఒక్కొక రూమ్ లో 15నుంచి 30మందితో కిక్కిరిసి ఉంటున్నారని, చదువు, క్రమశిక్షణ దెబ్బతింటుందని పేర్కొన్నారు. వీటికి కోట్ల రూపాయలు అద్దె క్రింద చెల్లిస్తున్నారు. వీటికి స్వంత భవనాలు నిర్మించడానికి స్థలాలు, బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.రెడ్డి హాస్టల్ కు, బ్రాహ్మణ సదన్ కు, కురుమ, గొల్లలకు, క్రిస్టియన్లకు, వీర శైవులకు ఇచ్చిన మాదిరిగా అత్యంత వెనుకబడిన కులాలకు సంచార జాతులకు ఇస్తే తమపేరు చారిత్రాత్మకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గతంలో అనేక ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాం. నిర్లక్ష్యం చేశారు. ఇపుడు తమరు ఈ సందర్భంగా తగు నిర్ణయం తీడుకోవాలని విజ్ఞప్తి. కావున తమరు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వెంటనే స్థలాలు, బడ్జెటు కేటాయించాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేసారు.

Tag: Hearing places for bee buildings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *