వేడి పుట్టిస్తున్న టెంపరేచర్

Date:13/02/2018
అనంతపురం ముచ్చట్లు:
శివరాత్రి పర్వదినం నుంచే జిల్లాలో ఎండ వేడిమి అధికంగా నమోదవుతోంది. దీంతో పగటి పూట ఎండలు మండుతున్నాయి. వేడి కారణంగా ఇళ్లలో తప్పనిసరిగా ఫ్యాన్లు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. 10 రోజుల క్రితం వరకూ చలికి వణికిన జనం ఇప్పుడు వేడి పెరుగుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఓవైపు జిల్లాలో అక్కడక్కడా అకాల వర్షాలు కురవడంతో కొంత మేర ఎండ వేడిమి తక్కువగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం సమయానికి జిల్లావ్యాప్తంగా వేడి అధికమవుతోంది. మధ్యాహ్న సమయానికి గరిష్టంగా 35, కనిష్టంగా 21 సెల్సియస్ డిగ్రీలు నమోదైంది. అలాగే ఈనెల 10న 34, 20, 9న 35, 20 చొప్పున నమోదైంది. ఈనెల 1 నుంచి కూడా ఎండ వేడిమి పెరుగుతూ వస్తోందని వాతావరణ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో గరిష్టంగా 35, కనిష్టంగా 19 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి 29 డిగ్రీలకు చేరింది. ఇక సోమవారం కూడా ఎండ వేడిమి ఉంటుందని, గరిష్టంగా 35, కనిష్టంగా 20 సెల్సియస్ డిగ్రీలు నమోదవుతుందని, మంగళ, బుధవారాల్లో కూడా సాధారణ ఉష్ణోగ్రతల కన్నా కొంత ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ఇంత వేడి ఉండేది కాదని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags: Heat generating temperatures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *