భారీగా తగ్గిన పోలింగ్‌ 

 Date:08/12/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
మహానగరంలో పోలింగ్‌ శాతం మళ్లీ నిరుత్సాహ పరిచింది. నగరంలో ఉన్న వారు సైతం ఓటు వేసేందుకు నిరాసక్తత కనబరిచారు. హైదరాబాద్‌లో జిల్లాలో 50.86%, మేడ్చల్‌ జిల్లాలో 54.99% పోలింగ్‌ నమోదైంది. ఓటింగ్‌లో పాల్గొనాలని అధికారులు, పార్టీలు అనేక విజ్ఞప్తులు చేసినా.. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఆశించిన స్థాయిలో పోలింగ్‌ జరగలేదు. 2014తో పోలిస్తే శుక్రవారం జరిగిన ఎన్నికల్లో నగరంలో పోలింగ్‌ తగ్గింది. 2014లో హైదరాబాద్‌లో 53% పోలవగా, ఈ ఎన్నికల్లో 50.86% నమోదైంది. 2014తో పోలిస్తే ముషీరాబాద్, సనత్‌నగర్,నాంపల్లి,కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహుదూర్‌పురా నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం తగ్గిపోగా, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, మలక్‌పేట తదితర నియోజకవర్గాల్లో పెరిగిందిపోలింగ్‌ బూత్‌లు, ఓటరు స్లిప్‌లకు ఆధునిక సాంకేతిక సహాయం అందుబాటులోకి వచ్చినా, అనేక చోట్ల ఓట్ల గల్లంతు, నివాసాల నుండి సుదూర ప్రాంతాల్లో పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటుతో చాలా మంది ఓటేసేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది.నియోజకవర్గాల వారీగా చూస్తే.. మల్కాజిగిరిలో 51.68%, కుత్బుల్లాపూర్‌లో 55.77%, కూకట్‌పల్లిలో 57.72%, ఉప్పల్‌లో 51.04% నమోదు కాగా, ఎల్బీనగర్‌లో 49%, మహేశ్వరంలో 55.09%, రాజేంద్రనగర్‌లో 57.29% ,శేరిలింగంపల్లిలో 48% పోలింగ్‌ నమోదైంది. ముషీరాబాద్‌లో 51.34%, అంబర్‌పేటో 55.20%, ఖైరతాబాద్‌లో 54%, జూబ్లీహిల్స్‌ 54.60%, సనత్‌నగర్‌లో 52.63%, నాంపల్లిలో 44.02%, సికింద్రాబాద్‌లో 57%, మలక్‌పేటలో 55.54%, కార్వాన్‌లో 50.89%, గోషామహల్‌లో 50.28%, చార్మినార్‌లో 46.03%, చంద్రాయణగుట్టలో 48%, యాకుత్‌పురాలో 45%, బహుదూర్‌పురాలో 49.50%, కంటోన్మెంట్‌లో 48.90% ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
Tags:Heavily reduced polling

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *