భారీగా పెరిగిన శనగ..

-రైతుల కళ్లలో ఆనందం
Date:17/04/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 40 వేల ఎకరాల్లో రైతులు శనగ సాగుచేయగా.. ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు వచ్చాయి.  మరో వైపు కందుల సీజన్ ముగియగా పంట విక్రయాలపై పలు ఆరోపణలు రావడంతో చర్యలకు ఉపక్రమించారు.  రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వచేసిన కందులను పట్టుకుని సీజ్ చేశారు.ప్రస్తుతం క్వింటాలు శనగ ధర రూ.5,400 మాత్రమే పలుకుతోంది. ఈ సమయంలో వ్యవసాయ శాఖ రైతులకు రాయితీపై శనగ విత్తనాల పంపిణీని మంగళవారం నుంచి ప్రారంభించింది. రాయితీపై ఇస్తున్న శనగ ధర క్వింటాలుకు రూ.4,813గా నిర్ణయించారు. అయితే వీటిని తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయ కార్యాలయం ముందు రేయింబవళ్లు రాయితీ విత్తనాల కోసం వేచి ఉండే రైతులు ఈసారి బహిరంగ విపణితో పోలిస్తే కేవలం రూ.600 మాత్రమే తేడా ఉండడంతో ఆసక్తి చూపక పోగా నాణ్యత లేని శనగలను కొని విత్తనం వేయడం కన్నా తమ వద్ద నిలువ ఉన్న శనగలే సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.జిల్లాలో రబీ సాధారణ సాగు 3.42 లక్షల హెక్టార్లు కాగా 2 లక్షల హెక్టార్లలో శనగ సాగు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా 1.90 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగైంది. దిగుబడి 4 నుంచి 5 బస్తాలే వచ్చింది. ధరలు ఆశాజనకంగా ఉంటాయని భావించిన రైతులు 8 లక్షల క్వింటాళ్ల మేరకు గోదాములు, ఇళ్లల్లో నిలువ ఉంచుకొన్నారు. కాని ఇప్పుడు ధరల పతనంతో పూర్తిగా నిరాశకు గురయ్యారు. నాఫెడ్ కేంద్రాల్లో శనగ కొనుగోలు కేంద్రాల్లో రైతులు మాత్రమే తమ పంటను విక్రయించుకునేలా చర్యలు తీసుకున్నారు. వీఆర్‌వోలు, వ్యవసాయ విస్తరణ అధికారుల జారీ చేసిన కూపన్ల మేరకు మార్కెట్‌యార్డుల్లో పంటను కొనుగోలు చేస్తారు. సీజన్ ప్రారంభంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనగ విత్తనాలు పంపిణీ చేయగా మండలా ల వారీగా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆ వివరాలను తీసుకున్నారు. విత్తనాలు తీసుకున్న ప్రకారం ఎకరాకు ఎంత దిగుబడి వస్తుందో క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించి కూపన్లు జారీ చేస్తున్నారువాతావరణం అనుకూలించడంతో పాటు తెగు ళ్లు, చీడపురుగులు బెడద నివారణకు రైతులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో పంట దిగుబడులు ఆశాజనకం గా ఉన్నాయి. శనగ పంటసాగుచేసిన రైతుకు ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు మార్కెటింగ్, నాఫె డ్ అధికారులు పంట కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు. కేంద్రం ఈ ఏడాది శన గ పంటకు క్వింటాకు రూ.4250 కనీస మద్దతు ధర ప్రకటించగా.రాష్ట్ర ప్రభుత్వం రూ.150 రైతులకు బోనస్ చె ల్లిస్తోంది. ఫలితంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్విం టాకు రూ.4400తో కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్, జైనథ్, బేల, ఇచ్చోడ, బోథ్‌లలో మార్క్‌ఫె డ్ అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా రైతులు భారీగా పంటను విక్రయానికి తీసుకొస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు శనగ క్వింటాకు రూ.3500 నుంచి రూ.3700 వరకు కొనుగోలు చేస్తుండగా.. ప్రభుత్వ కేంద్రాల్లో రైతులు మంచి ధరకు పంటను అమ్ముకుంటున్నారు. జిల్లాలో 12 రోజుల కిందట పంట కొనుగోళ్లు ప్రారంభకాగా ఇప్పటి వరకు 45,800 క్విం టాళ్ల పంటను కొనుగోలు చేశారు. ఎక్కువగా జైనథ్ మా ర్కెట్‌యార్డులో 26 వేల క్వింటాళ్లు, ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో 15 వేల క్వింటాళ్లు, బేలలో 2 వేల క్విం టాళ్లు, బోథ్‌లో 2 వేల క్వింటాళ్లు, ఇచ్చోడలో 800 కింటాళ్లను సేకరించారు.
Tags: Heavy grown

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *