బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు.. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు

హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజున బీజేపీ శాసనసభ్యులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాసనసభ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం  పై బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. అసెంబ్లీ స్పీకర్ నిబంధనలు పాటించకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారంటూ న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. ప్రణాళిక ప్రకారం రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారంటూ న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రొసీడింగ్ కాపీ ఎక్కడని ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది సమాధానమిస్తూ.. న్యూస్ పేపర్, న్యూస్ ఛానల్స్, యూట్యూబ్‌లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషన్ వేశామంటూ వెల్లడించారు. చట్టసభలో నిబంధనలు ఉల్లంఘించారంటూ సస్పెండ్ చేశారని కోర్టుకు విన్నవించారు. అయితే.. స్పీకర్ ఎవరిని సస్పెండ్ చేయాలనేది చెప్పాలి.. కానీ అలా జరగలేదంటూ వివరించారు. ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదని.. సభా గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినప్పుడు మాత్రమే సస్పెండ్ చేయాలి.. కానీ అలా జరగలేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ప్రసాద్ ధర్మాసనానికి వాదనలు వినిపించారు. ప్రొసీడింగ్స్ కాపీ ఇవ్వడానికి కుదరదని.. అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అటర్న్ జనరల్ హైకోర్టును కోరారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం.. శాసన సభ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ప్రొసీడింగ్స్ కాపీపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. అనంతరం ఈ విషయంపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
 
Tags:High Court issues key orders on suspension of BJP MLAs .. Notices to Assembly Secretary

Natyam ad