వనమా రాఘవ కు హైకోర్టులో ఊరట..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ కు చెందిన మండిగ నాగరామకృష్ణ కుటుంబ ఆత్మహత్య ఘటనలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు హైకోర్టులో గురువారం ఊరట లభించింది. వనమా రాఘవకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వనమా రాఘవ 61 రోజులు జైల్లో ఉన్నాడు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్ట్ రాఘవకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కొత్తగూడెం నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా ఉండాలని హైకోర్టు షరతు విధించింది. ప్రతి శనివారం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలని షరతు విధించింది..

Natyam ad