Hijra's job in the housing department

గృహ నిర్మాణ శాఖలో హిజ్రాకు ఉద్యోగం

Date : 04/01/2018

కడప ముచ్చట్లు:

సమాజంలో హిజ్రాలు గౌరవంగా జీవించాలనే సదుద్దేశంతో హిజ్రాలు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కల్పించిన ఏపీ ప్రభుత్వం వారి విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా కడపలో మొట్టమొదటిసారిగా పెనుగొండ శివ ఉరఫ్‌ జానకికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఈ మేరకు నియామక పత్రాన్ని జి.రఘునాథరెడ్డి కన్సల్టెన్సీ సర్వీసెస్‌ అధినేత జి.రఘునాథరెడ్డి జానకికి అందచేశారు. పులివెందులలో జరిగిన జన్మభూమి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కడపలో హిజ్రాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చామని ఇదే విషయాన్ని ప్రకటించారు. కాగా హిజ్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కల్పించింది. అలాగే ట్రాన్స్‌జెండర్ పాలసీని కుడా ప్రకటించింది. రాష్ట్రంలో 43,763 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్టు వెల్లడించింది. అయితే, వీరిలో 18 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.1500 పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. వారికి ఉద్యోగ నియామకాలు, పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్‌ కార్డులు అందచేయనున్నట్లు కూడా తెలిపింది. ట్రాన్స్‌జెండర్ల పట్ల ఎలాంటి వివక్ష ఉండకూడదని, విద్యా, ఉద్యోగాల్లో వివక్ష చూపరాదని ప్రభుత్వం ఆదేశించిన విష్యం తెలిసిందే.

Tags : Hijra’s job in the housing department

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *