పుంగనూరులో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి- జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:
 
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన , ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీపతి తో కలసి మండల కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ మండలంలో 1859 మందికి ఇండ్ల స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. అలాగే ఓటిఎస్‌ పథకాన్ని కూడ సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. సచివాలయ భవనాలు, ఆర్‌బికెలు, వెల్‌నేస్‌ సెంటర్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గమైన పుంగనూరు ఆదర్శంగా ఉండేలా అధికారులు పనిచేయాలన్నారు. అలాగే సచివాలయాలలో అన్ని సమస్యలు స్వీకరించి, వినతిపత్రాలకు రశీదులు ఇవ్వాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
Tags; Housing construction in Punganur should be accelerated – ZP CEO Prabhakar Reddy

Natyam ad