How many difficulties to lux baby

లక్స్ పాప కు ఎన్ని కష్టాలో

Date:12/10/2018
ముంబై  ముచ్చట్లు:
కొన్నిసినిమాలు ఎన్నిసార్లు చూసినా త‌నివి తీర‌దు. అస్స‌లు బోర్ కొట్ట‌దు. టీవీల్లో అలాంటి సినిమాలు వ‌స్తుంటే.. చేస్తున్న ప‌నిని ప‌క్క‌న పెట్టేయ‌టం అంద‌రికి అనుభ‌వ‌మే. అలాంటి సినిమాల్లో ఒక‌టి నువ్వు నాకు న‌చ్చావ్‌. ఆ సినిమాలో ఆర్తి అగ‌ర్వాల్ ఫ్రెండ్ గా మెరిసిన అందం ఆశా సైనీ అలియాస్ ఫ్లోరా సైనీ. ఆ సినిమాలో ఆశా సైనీని అట్రాక్ట్ చేసేందుకు వెంక‌టేశ్ పాత్ర ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తుందో తెలిసిందే. ఆశాను చూసిన చాలామంది ఆర్తి కంటే ఆమే బాగుంద‌నే వారు. అలాంటి ఆమె తాజా ఫోటో చూస్తే షాక్ తినాల్సిందే. తాజాగా మీటూ దుమారం భారీగా రేగుతున్న వేళ‌.. తాజాగా త‌న ప్రియుడు గౌరంగ్ దోషి త‌న‌పై ప్ర‌ద‌ర్శించిన పైశాచిక‌త్వాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ప్ర‌ద‌ర్శించిన ఆశా పోస్టు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.తాజాగా ఆశా త‌న ఫోటోను ఫేస్ బుక్ లోపోస్ట్ చేశారు.
అందులో ముఖం మీద గాట్ల‌తో క‌ళ త‌ప్పిన ఆమెను చూస్తే నోట మాట రాదంతే. తాను ఎదుర్కొన్న న‌ర‌కాన్ని చెబుతూ.. ఈ ఫోటోల్లో ఉన్న‌ది నేనే. 2007 ప్రేమికుల దినోత్స‌వం రోజు గౌరంగ్ దోషి న‌న్ను దారుణంగా కొట్టాడు. ఏడాది పాటు న‌ర‌కం చూపించాడు. ఆ సంద‌ర్భంగా నా ముఖంపై చెర‌గ‌ని గాట్లు ప‌డ్డాయి. గౌరంగ్ కు అప్ప‌ట్లో ప‌లుకుబ‌డి ఉండ‌టంతో ఆ విష‌యాల‌ను చెప్పినా ఎవ‌రూ న‌మ్మ‌లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.అత‌డి కార‌ణంగా త‌న‌కు అవ‌కాశాలు రాలేద‌ని.. త‌న‌కు అవ‌కాశాలు ఇవ్వ‌కుండా చాలానే చేశాడ‌న్న ఆశా సూనీ.. త‌న మాదిరే చాలామంది జీవితాల్ని నాశ‌నం చేశాడ‌ని.. ఇప్పుడు అలాంటి విష‌యాల్ని బ‌య‌ట‌పెట్ట‌టానికి ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. ఫేస్ బుక్ పేజీలో ఆమె పెట్టిన ఫోటోలు ఇప్పుడు షాకింగ్ గా మార‌ట‌మే కాదు.. అయ్యో అనేలా చేస్తున్నాయి.
Tags:How many difficulties to lux baby

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *