Natyam ad

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్ ఎలా

హైదరాబాద్ ముచ్చట్లు:

త్వరలో రెగ్యులర్విధానంలో భర్తీ చేయబోతున్న పోస్టుల్లో అవుట్సోర్సింగ్ఉద్యోగులకు వెయిటేజీ ఎలా ఇవ్వాలో అర్థం కాక వైద్యశాఖ గందరగోళానికి గురవుతున్నది. ప్రభుత్వం చేసిన ప్రకటన ఆఫీసర్లకు చిక్కులు తెచ్చింది. అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే ఉద్యోగుల రికార్డులు, ఇతర స్పష్టమైన హిస్టరిలేవీ అధికారికంగా ఎంట్రీ ఉండదు. దీంతో వెయిటేజ్మార్కులు ఇచ్చే సమయంలో కొంత ఆందోళన నెలకొనే పరిస్థితులు వస్తాయని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టీవీవీపీ, డీహెచ్, డీఎంఈ పరిధిలో సుమారు 3 వేల మంది సిబ్బందికి పైగా వివిధ విభాగాల్లో వర్క్ చేస్తున్నారు. వీరిలో కొందరు కంటిన్యూగా ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించడం లేదు. మధ్యలో బంద్అయి మళ్లీ తిరిగి విధుల్లో చేరిన వారు కూడా ఉన్నారు. దీంతో సదరు ఉద్యోగులకు వెయిటేజీ ఇస్తే చట్టపరమైన సమస్యలు, ఇతర ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నదని ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. వీటన్నింటిని బేరీజు వేస్తూ అవుట్ సోర్సింగ్ వెయిటేజీకి సంబంధించిన రూల్స్‌ను తయారు చేయాలని అధికారులు భావిస్తున్నారు.అవుట్ సోర్సింగ్విధానంలో వెయిటేజీ మార్కుల ప్రక్రియ ఫైనల్ అయితే కాంట్రాక్టర్లతో పెద్ద ఎత్తున పైరవీలు జరిగే ఛాన్స్ ఉన్నదని స్వయంగా ఆఫీసర్లే చర్చించుకుంటున్నారు. నిజాయితీగా డ్యూటీ చేసిన వారి కంటే ఇతరులకే వెయిటేజీ కలిసే అవకాశం ఉన్నదంటూ ఆందోళన చెందుతున్నారు. అవుట్ సోర్సింగ్ఉద్యోగులంతా కాంట్రాక్టర్ల చేతుల్లో ఉండటం వలన అక్రమంగా డబ్బు సంపాదించే అవకాశం ఉన్నది. మరోవైపు ఇప్పటికే సర్కార్ఆసుపత్రుల నుంచి ఇతర సంస్థలకు వెళ్లిపోయిన ఉద్యోగులు మార్కుల కోసం నేరుగా కాంట్రాక్ట్ర్లతో చర్చలు జరిపే ప్రమాదం ఉన్నది. దీంతో ప్రభుత్వ దవాఖాన్లలో సిన్సియర్‌గా పనిచేసిన వారు వెయిటేజ్ జాబితా నుంచి తొలగిపోయే ఛాన్స్ ఉన్నది. దీంతో అవుట్సోర్సింగ్వెయిటేజీ అంశంలో ప్రత్యేక నోడల్ఆఫీసర్‌ను నియమించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ దవాఖాన్లలో అవుట్సోర్సింగ్విధానంలో పనిచేసే ఉద్యోగులు కోరుతున్నారు.

 

Tags: How to Weightage for Outsourcing Employees

Post Midle
Post Midle