జాతరకు భారీ బందోబస్తు

వరంగల్ ముచ్చట్లు:
 
ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ సీపీ తరుణ్ జోషి తెలిపారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మేడారం
జాతర రూట్ మ్యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాతరను పూర్తిగావిజయవంతం చేయలని కోరారు. ఈసారి కూడా వన్ వే ఉంటుందని చెప్పారు. ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం గట్టమ్మ గుడి నుండి పస్రా వరకు 320 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు.
 
Tags: Huge provision for the fair

Natyam ad