భారీ రాతి శిల రాములోరి విగ్రహం..!

మడకశిర ముచ్చట్లు:
మంత్రాలయంలో  ప్రతిష్టించనున్న భారీ శ్రీరాముడి విగ్రహానికి రొళ్ల ప్రాంతం నుంచి రవాణా కానున్న  అరుదైన రాతి శిల మడకశిర పట్టణంలోకి విచ్చేసిన శుభ సందర్భంగా విశేష పూజలు అందుకుంటోంది. దారిపొడవునా విశేష పూజలతో ప్రజలు తరలిస్తున్నారు. 52 అడుగుల ఎత్తు అయిన శ్రీరాముని భారీ విగ్రహానికి
అనువైన ఏకశిలను మడకశిర నియోజకవర్గం రొళ్ళ మండలం పిల్లిగుండ్ల క్వారీ నుంచి తరలించడం విశేషం.  బెంగళూరుకు చెందిన అభయ రామ మందిర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 52 అడుగుల శ్రీరాముడి
ఏకశిలా విగ్రహం రూపొందనున్నది, విగ్రహం తయారీకి గానూ పిల్లి గుండ్ల లోని క్వారీలో భారీ రాతి శిలను గుర్తించి  విగ్రహం తయారీకి అనువుగా ఉందని ఎంపిక చేశారు. రాతి శిల 430 టన్నుల బరువు 15
అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు 18 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ రాయిని 136 చక్రాలు గల భారీ వాహనం తో మంత్రాలయానికి మేళతాళాలతో సాగనంపుతున్నారు. ఈ భారీ రాతి శిలమంత్రాలయం చేరుటకు  దాదాపు నెల రోజుల సమయం పడుతుందని సేవా ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు.
 
Tags:Huge stone statue of Ramulori ..!

Natyam ad