భార్యపై హత్యాయత్నం చేసిన భర్త

కర్నూలు ముచ్చట్లు:
 
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని జోలాపురం లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మస్తానయ్య అనే వ్యక్తి తన భార్య లక్ష్మిదేవి (38) పై పెట్రోల్‌పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడినట్లు సీఐ సుబ్బరాయుడు మంగళవారం తెలిపారు. ఇంటిలో భార్యతో గొడవ పడ్డ మస్తానయ్య భార్య వంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. వెంటనే బంధువులు స్పందించి తీవ్రంగా గాయపడ్డ లక్ష్మిదేవిని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బనగానపల్లె మెజిసే్ట్రట్‌ కిశోర్‌కుమార్‌ బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మిదేవి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. లక్ష్మిదేవి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని సీఐ తెలిపారు.
 
Tags; Husband who attempted murder on wife

Natyam ad