Husband's wife did not vote for his wife

భార్యకు ఓటేయలేదని భర్త ఘాతుకం!

-కుటుంబంపై కక్ష పెంచుకున్న కిరాతకుడు

-బాలికను కిడ్నాప్.. అత్యాచారం ఆపై హత్య

-ఝార్ఖండ్‌లో వెలుగుచూసిన దురాగతం

-పోలీసుల అదుపులో నిందితులు

Date: 14/01/2018

ఝార్ఖండ్‌ ముచట్లు:

ఓ కుటుంబం ఓటు వేయకపోవడం వల్లే తన భార్య ఎన్నికల్లో ఓడిపోయిందని భావించిన ఓ వ్యక్తి, సదరు కుటుంబానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను చంపేశాడు. లిట్టపరా గ్రామానికి చెందిన ఓ 13 ఏళ్ల బాలిక జనవరి 8 తెల్లవారుజామున బహిర్భూమికని వెళ్లింది. బాలిక ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వూరంతా గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలించగా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఇదిలాఉండగా తమ కుమార్తె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు స్థానికంగా ఉండే ప్రేమ్‌లాల్‌, మరో ముగ్గురిని అనుమానితులుగా అరెస్టు చేశారు. వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అందులో ప్రేమ్‌లాల్‌ భార్య పంచాయతీ పెద్దగా పోటీ చేసింది. అయితే ఆ ఎన్నికలో ఆమె ఓడిపోయింది. బాధిత బాలిక కుటుంబం ఓటు వేయకపోవడం వల్లే తన భార్య ఓడిపోయిందని అనుమానించిన ప్రేమ్‌లాల్‌ వారిపై పగ పెంచుకున్నాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు తన బంధువులతో కలిసి బాలికను కిడ్నాప్‌ చేశాడు. సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను చంపేశారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఝార్ఖండ్‌లోని పకూర్‌ జిల్లాలో జనవరి 8న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Tags: Husband’s wife did not vote for his wife

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *