అమ్మాయిల అక్రమ రవాణాలో హైదరాబాద్ నాల్గవస్థానం

హైదరాబాద్ ముచ్చట్లు:
ఐటీతోపాటు అభివృద్ధిలో అంతర్జాతీయ స్థాయికి దూసుకుపోతున్న హైదరాబాద్ నగరం అమ్మాయిల అక్రమ రవాణా బాగోతాలతో అపకీర్తిని మూటకట్టుకుంది. అమ్మాయిలను అక్రమంగా తరలించి వ్యభిచార గృహాలకు విక్రయించడంలో హైదరాబాద్ నగరం దేశంలోనే నాల్గవస్థానంలో నిలిచింది. జాతీయ నేర రికార్డుల సంస్థ అమ్మాయిల అక్రమ రవాణ, వ్యభిచార గృహాలకు విక్రయించిన అమ్మాయిల గురించి తన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో అమ్మాయిల విక్రయంపై 8,057 కేసులు నమోదు కాగా తెలంగాణలో 229 కేసులు, ఆంధ్రప్రదేశ్ లో 239 కేసులున్నాయి. వ్యభిచారం, అమ్మాయిల అక్రమ రవాణాలో ఏపీ మూడో స్థానం పొందింది. తెలంగాణాలో పోలీసులు 314 మంది అమ్మాయిలను వ్యభిచార గృహాల నుంచి కాపాడారు.
ఉద్యోగాలిప్పిస్తామని ఆశ పెట్టి అమ్మాయిలను అక్రమంగా తీసుకువెళ్లి వారిని వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 2016వ సంవత్సరంలో అమ్మాయిల అక్రమ రవాణ, విక్రయంపై హైదరాబాద్ నగరంలో 64 కేసులు నమోదైనాయి. మరో 76 మంది మహిళలను పోలీసులు వ్యభిచారం రొంపి నుంచి రక్షించారని నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో నివేదికలు తేటతెల్లం చేశాయి.
Tag:Hyderabad is the fourth place in the smuggling of girl


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *