లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కీలక పాత్ర-మంత్రి కేటీఆర్

హైదరాబాద్   ముచ్చట్లు:
దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జరగనున్న 19వ ఎడిషన్ బయో ఆసియా సదస్సును మంత్రి  గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సదస్సు రెండు రోజులపాటు జరగనుంది. వర్చువల్గా లైఫ్ సైన్సెస్ – ఆరోగ్య రంగంలో కొవిడ్ సవాళ్లపై సదస్సులో చర్చిస్తారు.
కేటీఆర్ మాట్లాడుతూ  రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి జీనోమ్ వ్యాలీ వెన్నెముకగా నిలుస్తుందని  స్పష్టం చేశారు. బిల్ గేట్స్తో జరిగే చర్చ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో సుమారు 215 సంస్థల నుంచి రూ. 6,400 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. ఇప్పటికే ఉన్నవాటితో పాటు కొత్తగా వచ్చిన సంస్థలతో ఏడాది కాలంలో 34 వేల మందికి ఉపాధి లభించిందన్నారు. గతేడాదితో పోలిస్తే 200 శాతం వృద్ధి సాధించింది. జీవశాస్త్ర రంగాల్లో హైదరాబాద్ ఏ విధంగా ప్రభావం చూపుతోంది.. ఈ వృద్ధినే నిదర్శనమని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రోత్సాహం అందిస్తుందనేది స్పష్టమవుతోందని కేటీఆర్ తెలిపారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:Hyderabad plays a key role in the field of life sciences-Minister KTR

Natyam ad