I have never been negative ... Positive to seduction

నా నువ్వే నెగిటివ్… సమ్మోహనానికి పాజిటివ్

Date:1806/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
గత వారంలో విడుదల అయిన తెలుగు సినిమాల్లో ఒకటి పాజిటివ్ ‌టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టుకొంటూ ఉండగా, ఇంకోటి నెగిటివ్ టాక్‌తో దెబ్బతింది. కల్యాణ్ రామ్ ‘నా నువ్వే’ను
నెగిటివ్ టాక్ దెబ్బతీయగా, సుధీర్ బాబు ‘సమ్మోహనం’కు పాజిటివ్ టాక్ సమ్మోహనంగా మారింది. ఈ సినిమా హిట్ దిశగా దూసుకెళ్తోంది. గత వారాంతంలో ఈ సినిమాలు
యూఎస్‌లో సంపాదించుకున్న వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే.. సమ్మోహనం హవా కొనసాగుతోందని, నా నువ్వే దెబ్బతిందని స్పష్టం అవుతోంది. సుధీర్ బాబు కెరీర్‌లోనే బెస్ట్ కలెక్షన్స్
దిశగా సాగుతోంది ‘సమ్మోహనం’. తొలి వారాంతం ముగిసే సరికి ఈ సినిమా దాదాపు నాలుగు లక్షల డాలర్ల వసూళ్లను సంపాదించుకుంది యూఎస్‌లో. ఈ హీరో కెరీర్‌ కే ఇవి బెస్ట్
ఓపెనింగ్స్. ఇంకా ఈ సినిమా థియేటర్ల వద్ద ఆడుతోంది. పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. దర్శకుడు ఇంద్రగంటికి మల్టీప్లెక్స్ ఆడియన్స్‌లో ఉన్న ఇమేజ్, పాజిటివ్ టాక్
ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు అయ్యాయి. ఇది బాక్సాఫీస్ వద్ద మరిన్ని వసూళ్లను రాబట్టుకునే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. గత గురువారం రోజున ఈ సినిమా
61,084 డాలర్లను, శుక్రవారం 94,150 డాలర్లను, శనివారం 1,40,222 డాలర్లను, ఆదివారం 90 వేల డాలర్లను సంపాదించుకుంది. ఇక ఫర్వాలేదనిపించుకునే
ఓపెనింగ్స్‌ను పొందినప్పటికీ ‘నా నువ్వే’ ఆ ఊపును కొనసాగించలేకపోయింది. బుధవారం 45,598 డాలర్లను, గురువారం 9,770 డాలర్లను, శుక్రవారం 12,496
డాలర్లను, శనివారం ఆరువేల డాలర్లను సంపాదించుకుంది ఈ సినిమా. యూఎస్‌లో మొత్తంగా ఇది 81వేల డాలర్లను సంపాదించుకుందని సమాచారం.
Tags:I have never been negative … Positive to seduction

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *