I loved the review

మనసుకు నచ్చింది  రివ్యూ

Date:16/02/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
తారాగణం: సందీప్‌ కిషన్‌.. అమైరా దస్తూర్‌.. త్రిదా చౌదరి .. అదిత్‌ అరుణ్‌.. ప్రియదర్శి.. తదితరులు
మ్యూజిక్: రధన్‌
ప్రొడ్యూసర్: పి.కిరణ్‌.. సంజయ్‌ స్వరూప్‌
డైరెక్టర్: మంజుల ఘట్టమనేని
నటిగా, ప్రొడ్యూసర్ గా మంజుల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందిరా ప్రొడక్షన్స్ పై హిట్ సినిమాలు నిర్మించారు. కొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్లతో ఆకట్టుకున్నారు. ఫస్ట్ టైమ్ ఆమె డైరెక్టర్ గా తెరకెక్కించిన సినిమా మనసుకు నచ్చింది. సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన ఈ మూవీకి..సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు.ఇక వరుస ఫ్లాపులతో ఉన్న హీరో సందీప్ కిషన్ కు ఈ సినిమా చాలా ముఖ్యం. మరి డైరెక్టర్ గా మంజులకు, హీరోగా సందీప్ కు ఈ సినిమా బ్రేక్ ఇచ్చిందా..?
స్టోరీ: సూరజ్‌(సందీప్‌ కిషన్‌), నిత్య(అమైరా దస్తూర్‌) బావ మరదళ్లు. చిన్నప్పటి నుంచి స్నేహితుల్లా ఉంటారు. పెద్దలు వీరిద్దరికీ పెళ్లి చేద్దామనుకుంటారు. కానీ ఇద్దరూ తాము మంచి ఫ్రెండ్స్ అని.. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. ఎవరి జోడీ వాళ్లు వెతుక్కోవడానికి గోవా వెళ్తారు. అక్కడ సూరజ్‌కు నిక్కీ(త్రిదా చౌదరి), నిత్యాకు అభయ్‌(అదిత్‌ అరుణ్‌) పరిచయం అవుతారు. వాళ్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ, నిత్య మాత్రం తన మనసులో ఉన్నది అభయ్‌ కాదు.. సూరజ్‌ అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తన మనసులో ఉన్న ప్రేమను సూరజ్‌కు చెప్పగలిగిందా? ఎవరికి నచ్చిన భాగస్వాములను వారు తెచ్చుకోగలిగారా? అన్నది కథ!
ఎలా ఉంది: స్నేహం.. ప్రేమ ఈ నేపథ్యంలో సినిమాలు టాలీవుడ్ లో చాలా కామన్. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య స్నేహం.. ప్రేమ అనే అంశాలను టచ్ చేస్తూ చాలా సినిమాలు వచ్చాయి. ఇక్కడ కూడా అదే  లైన్ టచ్  చేశారు. ఇద్దరు భిన్న వ్యక్తిత్వాలు ఉన్న స్నేహితులు.. తమకు నచ్చినదారుల్లో తమ జీవితాన్ని ఆస్వాదించడం.. ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం! సింపుల్ గా చెప్పాలంటే ఇదే స్టోరీ. ఇదే లైన్ చుట్టూ సిన్నివేశాలను అల్లుకుంది దర్శకురాలు. స్టోరీకి  నేచర్ అనే కోణాన్ని జత చేసింది. కానీ అదే వర్కవుట్ కాలేదు. సన్నివేశాల్లో కొత్తదనం లేదు. కొన్ని సీన్స్ సాగదీసినట్లుగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో స్టోరీ ముక్కోణపు ప్రేమ కథగా మారుతుంది. డైరెక్టర్ కూడా తనకు నచ్చిన కథ, తనకు నచ్చినట్టుగా తెరకెక్కించారు. కానీ అది ప్రేక్షకులకు నచ్చేలా తీయలేదనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా పాత సినిమా  ఛాయలే కనిపిస్తాయి. సినిమాలో క్యారెక్టర్లు తప్ప.. స్టోరీ బలంగా లేదు. మెడిటేషన్‌ గురించి చెప్పిన.. చూపించిన సన్నివేశాలు యోగా సీడీని చూస్తున్న ఫీలింగ్‌ను కలిగిస్తాయి.
ఎలా చేశారు: సందీప్‌ కిషన్‌ లోని నటనను సినిమాలో సరిగా వాడుకోలేదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో సందీప్ నటన ఓవర్ యాక్షన్ లా అనిపిస్తుంది. హీరోయిన్లు చూడ్డానికి బాగానే ఉన్నారు. త్రిదా చౌదరి బికినీలో ఎక్స్‌పోజింగ్‌ చేసింది. అమైరా దస్తూర్‌కు నటించే అవకాశం దక్కింది. నాజర్‌ మినహా మిగిలిన వారెవరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయలేదేమో అనిపిస్తుంది. రధన్‌ సంగీతం, పాటలు, సాహిత్యం వినసొంపుగా ఉన్నాయి. రవియాదవ్‌ కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. గోవా పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్‌ చేశారు. అక్కడి అందాలను, సముద్రాన్ని కెమెరాలో చక్కగా బంధించారు. స్టోరీ రొటీన్ గా ఉంది.
ప్లస్ పాయింట్స్
+ మ్యూజిక్
+ సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
స్టోరీ, స్క్రీన్ ప్లే
Tags: I loved the review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *