కుళ్లిన మృతదేహం గుర్తింపు.

పిడుగురాళ్ల  ముచ్చట్లు:
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శివార్లలో కుళ్లిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి చొక్కాలో దొరికిన ఆధార్ కార్డు ద్వారా బుచ్చిరెడ్డిపా లెం చెందిన దొంతిరెడ్డి సుమన్ క్రాంత్  (38)గా గుర్తించారు. పిడుగురాళ్ల పోలీసుల సమాచారంతో మంగళవారం బుచ్చి ఎస్సై  ప్రసాద్రెడ్డి బంధువులకు విషయాన్ని తెలియజేశారు. గత నెల 10వతేదీ వరకు బుచ్చి పెద్దూరులోని ఓ అద్దెఇంట్లో సుమన్ క్రాంత్, లావణ్య దంపతులు కాపురమున్నారు. సుమన్ క్రాంత్ గుంటూరులో ఫిజియోథెరపిస్టు కాగా, లావణ్య నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు గా పనిచేస్తున్నారు. గతంలో భార్యభర్తలు గుంటూరులో కాపురముండేవారు. సుమన్ క్రాంత్ గుంటూరులో రూ.30లక్షలు,బుచ్చిలో రూ. 10లక్షలు అప్పులున్నాయని సమాచారం.
ఈ క్రమంలో గత నెల 10వతేదీ ఇంటి నుంచి వెళ్లిన సుమన్ క్రాంత్, 12వతేదీన ఆఖరిసారిగా భార్యకు ఫోన్ చేశాడు. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం పిడుగురాళ్ల శివార్లలో మృతదేహాన్ని గుర్తించారు.
 
Tags:Identification of rotten corpse

Natyam ad