వంగవీటి విగ్రహావిష్కరణ…

ఏలూరు ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం కోళ్ళపర్రు గ్రామంలో ప్రజానాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మోహనరంగా తనయుడు వంగవీటి రాధా కృష్ణ విచ్చేసి విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు, వైయస్సార్ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ నాయకులు ఎందరున్నా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. మోహన రంగాని ఒక పార్టీ కో, ఒక కులానికో, పరిమితం చేయొద్దు అన్నారు. ప్రజా సమస్యలకు ఎదురొడ్డి ప్రజానాయకుడిగా చిరస్థాయిగా ఎన్నటికీ ప్రజల మనసులో రంగా నిలిచిపోయి ఉంటారన్నారు.
 
Tags:Idolatry of Vangaviti

Natyam ad