గ్రహాంతరవాసుల మెసేజ్ లను అర్థం చేసుకోకపోతే..ప్రపంచం నాశనం

– శాస్త్రవేత్తల హెచ్చరిక
Date:15/02/2018
జర్మనీ  ముచ్చట్లు:
గ్రహాంతరవాసుల మెసేజ్లనుఅర్థంచేసుకోకపోతే..ప్రపంచం నాశనం చేస్తాయని శాస్త్రవేత్తల హెచ్చరిస్తున్నారు.ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని స్పేస్ ఏజన్సీలు అన్వేషణ కొనసాగిస్తున్న తరుణంలో… ఇద్దరు శాస్త్రవేత్తలు మాత్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. విశ్వాంతరాళాల నుంచి ఏలియన్స్ పంపుతున్న మెసేజ్ లను మనం సరిగా అర్థం చేసుకోలేకపోతే… భూమిమీద ఉన్న జీవం మొత్తాన్ని వారు నాశనం చేసేస్తారని హెచ్చరించారు. వారు మన భూమి మీదకు ప్రత్యక్షంగా రావాల్సి అవసరం కూడా లేదని… కేవలం తమ సందేశాల ద్వారానే భూగోళాన్ని నాశనం చేయగలరని చెప్పారు.’ఇంటర్ స్టెల్లార్ కమ్యూనికేషన్.IX.మేస్సేజ్ డీకంటామినేషన్ ఈజ్ ఇంపాజిబుల్’ అనే పేరుతో మిఖాయెల్ హప్కే, జాన్ లు అకాడమెక్ పేపర్ ను తయారు చేశారు. వీరిద్దరూ యూనివర్శిటీ హవాయి మరియు జర్మనీలోని సోన్నెబర్గ్ అబ్జర్వేటరీలకు చెందినవారు. విశ్వం నుంచి మనకు తరంగాల రూపంలో అందుతున్న మెసేజ్ లను ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని తమ పేపర్ లో వీరు చర్చించారు. ఏలియన్ల మెసేజ్ లను ఓపెన్ చేసిన తర్వాత వాటిని మనం సరిగా డీకోడ్ చేయలేకపోతే (అర్థం చేసుకోలేకపోతే)… జరగబోయే అనర్ధాలను కనీసం అంచనా కూడా వేయలేమని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, మెసేజ్ లను ఓపెన్ చేయకుండా, అలాగే వదిలేయడం మంచిదని అభిప్రాయపడ్డారు.ఏ ఏలియన్ సివిలైజేషన్ తో కూడా మనం కమ్యూనికేషన్ ఏర్పరుచుకోరాదని… అది మనకు మంచిది కాదని వీరు హెచ్చరించారు. మెసేజ్ ఓపెన్ చేయకుండా అందులో ఎలాంటి సమాచారం ఉందో మనం చెప్పలేమని… ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే వినాశనం తప్పదని చెప్పారు. యుద్ధనౌకలను పంపడం కన్నా చాలా చౌకగా… మెసేజ్ ల ద్వారానే వారు భూమిని నాశనం చేయగలరని తెలిపారు. కంప్యూటర్ వైరస్ రూపంలో స్పేస్ నుంచి మెసేజ్ వస్తాయని… మన నెట్ వర్క్ లను నాశనం చేస్తాయని చెప్పారు. ఎలాంటి కోడ్ లను మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేయరాదని… ఇమేజెస్, మ్యూజిక్ వంటివి అయితే పర్వాలేదని తెలిపారు.
Tags: If you do not understand the aliens’ messages, destroy the world

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *