ఆటో డ్రైవర్లకు ఇఫ్టూ అండ- కుడుం విజయ్ కుమార్

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతి నగరంలోని ఆటో డ్రైవర్లకు ఇఫ్టూ అనుబంధ ప్రగతిశీల ఆటో వర్కర్స్ ఫెడరేషన్ అండగా ఉంటుందని ఆయూనియన్ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కుడుం విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ నగర్లోని డిపిఆర్ కళ్యాణ మండపం సమీపంలో ఐఎఫ్టీయు అనబంధ ఆటో స్టాండును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగులు రాక, నిరుద్యోగులుగా బ్రతకలేక బ్రతుకు తెరువు కోసం ఆటో నడుపుతున్న వారే ఎక్కువ మంది ఉన్నారన్నారు. సొంత ఇల్లు లేక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించారు. ఆటో డ్రైవర్లు ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతుం దని చెప్పారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కారించేందుకు ఇఫ్టూ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు. ఫెడరేషన్ నగర అధ్యక్షుడు రాజగోపాల్ మాట్లాడుతూ నగరంలో ఆటో డ్రైవర్లందరు ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. వారికి తాము అండగా నిలుస్తామని చెప్పారు. తిరుపతిలో ప్రశాంత వాతావరణానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నగర కోశాధికారి పి.కిషోర్, నాయకులు దిలీప్, వి.రెడ్డి శేఖర్ రెడ్డి, , ఎ.చక్రపాణి స్వామి, శీను, ధనశేఖర్, మురళి, పి.గిరి, వై.పరుశురామ్, పి.నరసింహులు, డి.వెంకన్న, ఆర్.ధనశేఖర్, డి.చంద్ర శేఖర్, వి.వెంకటరమణారెడ్డి, పి.భక్తవత్సలం రెడ్డి, ధనంజయ రెడ్డి, పి.చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Iftu Anda-Kudum Vijay Kumar for Auto Drivers

Natyam ad