'I'm wrong I'm wrong'

‘నేను తప్పు చేసినట్లు ఆధారాల్లేవ్’

సాక్షి

Date :03/01/2018

ఇస్లామాబాద్‌ : తాను తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాల్లేవని పాకిస్థాన్‌ పదవీచ్యుత మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అన్నారు. తనపై కావాలనే కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ విషయాలు కూడా త్వరలోనే నిరూపితమవుతాయని అన్నారు. పనామా కుంభకోణం కేసులో పాక్ మాజీ ప్రధాని షరీఫ్‌ కూడా ఉన్నారని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆయన తన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నవాజ్‌ కూతురుకు కూడా హస్తం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఆయన బుధవారం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయనను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘వారిదగ్గర నేను తప్పు చేసినట్లు నిరూపించే ఆధారాలు ఏవీ లేవు. వాస్తవానికి నేను ఏ తప్పు చేయలేదు. ఉద్దేశ పూర్వకంగా కొంతమంది వ్యక్తులు చేసిన కుట్రలే ఆ ఆరోపణలు’ అని ఆయన అన్నారు. కాగా, ఈ కేసు విచారణను కోర్టు జనవరి 9కు వాయిదా వేసింది.

Tags : ‘I’m wrong I’m wrong’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *