జయశంకర్ జిల్లాల్లో  13 శాతం డ్రాప్ ఔట్ లో.

వరంగల్ ముచ్చట్లు:
రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో బడి మానేస్తున్న విద్యార్థుల (డ్రాపౌట్‌ రేటు) సంఖ్య ఇంకా కొనసాగుతున్నది. 2019-20 విద్యాసంవత్సరంలో 12.29 శాతం మంది బడి మానేసిన వారిలో ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌ నివేదిక ఈ గణాంకాలున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా ఉన్నత పాఠశాలల్లో 29.49 శాతం మంది విద్యార్థులు డ్రాపౌట్‌ అయ్యారు. 13 జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలల్లో సున్నా డ్రాపౌట్‌ రేటు నమోదు కావడం గమనార్హం. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 0.06 శాతం, ఉన్నత పాఠశాలల్లో 12.29 శాతం మంది విద్యార్థులు బడి మానేస్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో తొమ్మిది జిల్లాల్లో డ్రాపౌట్లు లేరు. టీచర్‌ స్టూడెంట్‌ రేషియో ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం 40 మంది పిల్లలకు ఒచ టీచర్‌ ఉండాలి. రాష్ట్రంలో టీచర్‌ స్టూడెంట్‌ రేషియో పటిష్టంగా ఉందని ఆ నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో 40,898 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో 60,06,344 మంది విద్యార్థులు చదివారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 2,902 పాఠశాలలు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అత్యల్పంగా 537 పాఠశాలలున్నాయి. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 111.96, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు 97.46, తొమ్మిది, పది తరగతుల్లో 88 నమోదైంది. అన్ని తరగతుల్లోనూ రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
 
Tags:In Jayashankar districts 13 per cent drop out

Natyam ad