In the tortoise,

తెరాస హయంలో మాదిగలకు ఆన్యాయం

 Date:19/09/2018
చెన్నూరు ముచ్చట్లు:
 తెరాస అధికారంలోకి వచ్చాక మాదిగ జాతికి అన్యాయం జరుగుతోందని ఎమ్మార్సీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ విమర్శించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం లో గట్టయ్య మృతదేహానికి నివాళులు అర్పించిన అనంతరం మందకృష్ణ మాదిగ   మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ద్రోహులకు టికెట్లు ఇచ్చిన కేసీఆర్… ఉద్దేశపూర్వకంగా ముగ్గురు మాదిగ బిడ్డలకు అన్యాయం చేశారని ఆరోపించారు.
ఓదెలును పక్కనబెట్టి ఆయన స్థానంలో మాల నేతను అభ్యర్థిగా ప్రకటించడం అన్యాయమని మండిపడ్డారు. దొరల పెత్తనాన్ని ప్రశ్నించినందుకే కేసీఆర్ బంధువు ప్రమేయంతో చొప్పదండిలో శోభను పక్కనబెట్టారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.
Tags:In the tortoise,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *