లాజిస్టిక్‌ హబ్‌గా ఏపీ

-రాష్ట్రంలో రెండు మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు
-విశాఖపట్నంలో 390 ఎకరాలు, అనంతపురంలో 205 ఎకరాల్లో ఏర్పాటు
-ఎన్‌హెచ్‌ఏతో కలసి ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
 
విజయవాడ ముచ్చట్లు:
 
సీఎం జగన్, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సమక్షంలో విజయవాడలో నేడు ఒప్పందంరహదారి ప్రాజెక్టులను సంయుక్తంగా ప్రారంభించనున్న సీఎం, కేంద్ర మంత్రిరూ.10,401 కోట్లతో నిర్మించిన 31 రహదారుల ప్రాజెక్టులు ప్రారంభంరూ.11,157 కోట్లతో ఇప్పటికే నిర్మించిన 20 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపనఎగుమతులు, దిగుమతులకు సౌలభ్యంవిశాఖలో ఏపీఐఐసీకి చెందిన 389.14 ఎకరాలలో లాజిస్టిక్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది జాతీయ రహదారికి 8 కి.మీ దూరంలో, విశాఖ పోర్టుకు 33 కి.మీ దూరంలో ఉంది. ఈ లాజిస్టిక్‌ పార్క్‌ కేంద్రంగా విదేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు సౌలభ్యంగా ఉంటుంది.విశాఖపట్నంలోని 1,100 పరిశ్రమలతో పాటు ఆ జిల్లాలో ఫార్మాసిటీకి సమీపంలో ఉంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ తదితర రాష్ట్రాల పారిశ్రామిక అవసరాలకు ఈ లాజిస్టిక్‌ పార్క్‌ కేంద్ర స్థానంగా మారనుంది.లాజిస్టిక్‌ పార్క్‌ కోసం గుర్తించిన ప్రాంతానికి సమీపంలో పారిశ్రామిక అవసరాల కోసం దాదాపు 9 వేల ఎకరాల భూమి ఏపీఐఐసీ ఆధీనంలో ఉంది. దాంతో ఆ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దాంతో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి.అనంతపురంలో లాజిస్టిక్‌ పార్క్‌ కోసం ఏపీఐఐసీ 205 ఎకరాలను గుర్తించింది. ఆ ప్రదేశం కియా పరిశ్రమకు 7 కి.మీ దూరంలో, జాతీయ రహదారికి 10 కి.మీ, బెంగళూరు విమానాశ్రయానికి 142 కి.మీ దూరంలో ఉంది.ఆ ప్రాంతంలో లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటుతో అనంతపురం జిల్లాలోని 2,700 పరిశ్రమలకు ప్రయోజనకరం.ఆటోమొబైల్, సౌర విద్యుత్తు, మినరల్, ఫార్మాస్యూటికల్, బయోటెక్నికల్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు ఈ లాజిస్టిక్‌ పార్క్‌ ఉపయోగకరంగా ఉంటుంది.ఈ పార్క్‌ కోసం గుర్తించిన భూములకు సమీపంలో పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ ఆధీనంలో 3,500 ఎకరాల భూమి ఉంది. దాంతో ఆ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు ఉంటాయి.
 
 
 
పారిశ్రామికాభివృద్ధికి ఊతంపారిశ్రామికాభివృద్ధికి కీలకమైన జాతీయ రహదారుల అభివృద్ధిలో రాష్ట్రం సరికొత్త మైలు రాయిని చేరుకోనుంది.రాష్ట్రంలో మొత్తం రూ.10,401 కోట్లతో 741 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 31 రహదారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు.వీటిలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ రూ.5,740 కోట్లతో 571 కిలోమీటర్ల మేర 24 ప్రాజెక్టులు నిర్మించనుంది. ఇక జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రూ.4,661 కోట్లతో 170 కిలోమీటర్ల మేర ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తోంది.రూ.11,157 కోట్లతో ఇప్పటికే నిర్మించిన 20 రహదారులను సీఎం వైఎస్‌ జగన్, కేంద్రమంత్రి గడ్కరీ సంయుక్తంగా గురువారం ప్రారంభించనున్నారు. మొత్తం మీద 51 జాతీయ రహదారుల అభివృద్ధితో రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి దిశగా మరింత వేగంతో దూసుకుపోయేందుకు మార్గం సుగమం కానుంది.రవాణా వ్యయం తగ్గింపే లక్ష్యంప్రస్తుతం దేశంలో ఒక వస్తువు ధరలో 13% కేవలం రవాణా వ్యయమే ఉంటోంది. ‘ఎంఎంఎల్‌పీ’ల ఏర్పాటుతో సరుకు రవాణా వ్యయాన్ని 8%కి తగ్గించాలన్నది లక్ష్యం. అందుకు ‘ఎంఎంఎల్‌పీ’లను హైవేలు, రైల్, జల రవాణాతో అనుసంధానిస్తారు.ప్రస్తుతం దేశంలో సరుకు రవాణాలో 65% రోడ్డు మార్గం ద్వారానే జరుగుతోంది. ఇది ఎక్కువ వ్యయంతో కూడుకొన్నది. ఈ వ్యయం తగ్గించడానికి పారిశ్రామిక తయారీ కేంద్రాల నుంచి చిన్న వాహనాల ద్వారా సరుకును ఎంఎంఎల్‌పీలకు చేరవేస్తారు. అక్కడ నుంచి భారీ వాహనాలు లేదా చౌకగా ఉండే జల, రైల్‌ రవాణా ద్వారా పంపిస్తారు.
 
Tags:In Uttar Pradesh, 13 people fell into a well and died

Natyam ad